విష్ణుప్రియ, పృథ్వీ బ్రేకప్.. అంతలోనే ప్యాచప్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్న ప్రతి ఒక్కరికి విష్ణు ప్రియ, పృథ్వీ వన్ సైడ్ ప్రేమ వ్యవహారం తెలిసే ఉంటుంది.
By: Tupaki Desk | 8 Nov 2024 6:40 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్న ప్రతి ఒక్కరికి విష్ణు ప్రియ, పృథ్వీ వన్ సైడ్ ప్రేమ వ్యవహారం తెలిసే ఉంటుంది. మొదట్లో పృథ్వీ సైతం విష్ణుప్రియపై ఇంట్రస్ట్ ఉన్నట్లుగా వ్యవహించినా కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్‌గానే విష్ణు ప్రియతో ఇంట్రస్ట్ లేదని తేల్చి చెప్పేశాడు. అయినా విష్ణు ప్రియ అతడిని పట్టుకుని వేలాడుతూనే ఉందనే విమర్శలు వచ్చాయి. అతడి చుట్టూ తిరగడం, అతడి పనులు చేసి పెట్టడం చేస్తూ ఉన్న విష్ణు ను చూసి చాలా మంది హౌస్‌మెంట్స్ ఆ పాయింట్ మీద నామినేషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా విష్ణు మాత్రం అతడి చుట్టూ తిరగడం మానేయలేదు. అతడి గురించి టాపిక్ వచ్చినప్పుడు తెగ సిగ్గు పడుతూ మెలికలు తిరగడం చేస్తూ ఉంటుంది.
పృథ్వీ అంటే అంతగా ఇష్టపడే విష్ణు ప్రియ ఒకానొక సమయంలో అతడు అన్న మాటకు బాగా హర్ట్ అయింది. ఆ విషయాన్ని స్వయంగా యష్మి వద్దకు వెళ్లి చెప్పింది. నిఖిల్ తోనూ తనకు ఇకపై పృథ్వీ అనే వ్యక్తి లేడు అంటూ పెద్ద పెద్ద మాటలు అనేసింది. తనను వ్యక్తిగతంగా తక్కువ చేసే వ్యక్తి గురించి నేను పట్టించుకోను అంది. విష్ణు కు సారి చెప్పందుకు సైతం మొదట పృథ్వీ నో చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ విష్ణు కు క్షమాపణ చెప్పడం జరిగింది. అతడు క్షమాపణలు చెప్పడానికి ఆమె వద్దకు వెళ్లలేదు. ఆమె అతడి వద్దకు వెళ్లింది. ఆ సమయంలో పృథ్వీ సారీ చెప్పడం జరిగింది. అయినా విష్ణు ప్రియ కరిగి పోయింది.
అప్పటి వరకు అతడితో ఇకపై మాట్లాడేది లేదు అంటూ కోపంగా ఉన్న విష్ణు ఒక్కసారి అతడు సారీ చెప్పడంతో పాటు రెండు మాటలు కూల్ గా మాట్లాడటంతో పూర్తిగా పరిస్థితి మారిపోయింది. అప్పటికప్పుడు బ్రేకప్ చెప్పిన విష్ణు ప్రియ, కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకుని ప్యాచప్ చేసుకోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పృథ్వీ అంటే విష్ణు కు ఎంత అభిమానం ఉందో, అతడు అంటే ఎంతగా ఆమె ఆరాధిస్తుందో దీన్ని బట్టి అర్థం అవుతుందని బిగ్ బాస్ ను చూసే ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రోమో చూసి విష్ణు, పృథ్వీ బ్రేకప్ అనుకున్న వారు ఎపిసోడ్ లో ప్యాచప్ చూసి షాక్ అయ్యారు.
ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నారని, ఏ ఒక్కరు జెన్యూన్‌గా ఆడుతున్నట్లు అనిపించడం లేదని రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ సీజన్ మరో చెత్త సీజన్ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి క్లైమాక్స్ చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 8 ను ఎలా ముగిస్తారు అనేది చూడాలి. ఇక పై అయినా సీజన్ కి ఆసక్తిని జోడించే విధంగా కొత్త కొత్త టాస్క్‌లు, వింత గేమ్‌లు ఏమైనా పెట్టేనా చూడాలి. అవే రొటీన్ లవ్ ట్రాక్, అదే మూస పద్దతిలో సీజన్ 8 సాగుతుందని చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.