Begin typing your search above and press return to search.

పొట్టి డ్రెస్సులో విష్ణుప్రియా మతిపోగొట్టే గ్లామర్

విష్ణు ప్రియ తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఎంతటి గుర్తింపు పొందిందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Jun 2024 11:24 AM GMT
పొట్టి డ్రెస్సులో విష్ణుప్రియా మతిపోగొట్టే గ్లామర్
X

విష్ణు ప్రియ తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఎంతటి గుర్తింపు పొందిందో అందరికీ తెలిసిందే. అనసూయ, రష్మీ, శ్రీముఖిల తర్వాత, టీవీ షోలలో ఎక్కువగా కనిపించే యాంకర్ గా విష్ణు ప్రియ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. "నెంబర్ వన్ యారి" ప్రోగ్రామ్ తో కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ, "పోవే పోరా" షో ద్వారా మరింత పాపులారిటీ సాధించింది. సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన ఈ షో ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

సోషల్ మీడియా వేదికగా కూడా విష్ణు ప్రియ ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. పక్కా తెలుగు అమ్మాయి అయినప్పటికీ, తన గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల, తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న డ్రెస్సులో విష్ణు ప్రియ అందాలను ఆరబోస్తూ ఫోజులు ఇచ్చింది. పొట్టి స్కర్ట్ లో అమ్మడు ఇచ్చిన స్టిల్ మామూలుగా లేదు.

లెగ్స్ అందాలతో ఎద అందాలతో అమ్మడు మరింత డోస్ పెంచుతూ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఆమె వేసిన డ్రెస్, స్టైలింగ్, ఫోటోలు చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులయ్యారు. కొన్ని కామెంట్ల ప్రకారం, "విష్ణు ప్రియ ఎలాంటి డ్రెస్ వేసినా ఆ డ్రెస్ కే అందం వస్తుంది" అని నెటిజన్లు పేర్కొన్నారు. విష్ణు ప్రియ గతంలో ఇంతకంటే ఘాటైన ఫోటోషూట్లను కూడా చేయగా, తాజా ఫోటోలు ప్రత్యేకంగా ఉన్నాయని అభిమానులు అంటున్నారు.

టీవీ షోలలో ఇటీవల ఎక్కువగా కనిపించకపోయినా, ఆమె ఇతర కార్యక్రమాలలో, వెబ్ సిరీస్ లలో కనిపిస్తూ తన ప్రతిభను చాటుకుంటోంది. తాజాగా "దయా" వెబ్ సిరీస్ లో షబానా అనే పాత్రలో నటించిన విష్ణు ప్రియ, తన నటనతో మెప్పించింది. ఈ సిరీస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికపై ప్రసారమవుతూ మంచి స్పందన పొందుతోంది.

విష్ణు ప్రియ ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఆమె కెరీర్ లో కొత్త మలుపులు ఎలా ఉంటాయో, కొత్త ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇటీవల ఒక లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ వాటిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా, విష్ణు ప్రియ తన టాలెంట్, అందంతో ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తూ ముందుకు సాగుతోంది.