Begin typing your search above and press return to search.

విష్ణుప్రియ.. ఘాటైన లుక్కులో స్టన్నింగ్ గ్లామర్

తాజాగా మునుపెన్నడూ లేనంత గ్లామర్ తో సొగసులు చూపిస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల్లో విష్ణు ప్రియను చూడటానికి రెండు కళ్లు సరిపోవని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 Jun 2024 1:48 PM GMT
విష్ణుప్రియ.. ఘాటైన లుక్కులో స్టన్నింగ్ గ్లామర్
X

విష్ణు ప్రియ తెలుగు టెలివిజన్ ప్రేక్షకులలో ఎంతగా క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనసూయ, రష్మీ, శ్రీముఖిల తర్వాత టీవీ షోలలో ఎక్కువగా కనిపించే యాంకర్ గా పేరు సంపాదించుకుంది. "నెంబర్ వన్ యారి" ప్రోగ్రామ్ తో కెరీర్ మొదలుపెట్టిన విష్ణు ప్రియ, ఆ తరువాత "సుడిగాలి సుధీర్" తో కలిసి చేసిన "పోవే పోరా" షోతో పాపులారిటీ పెంచుకుంది. ఆమె టాలెంట్, ఎనర్జీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

విష్ణు ప్రియ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో కూడా ఎంతో చురుగ్గా ఉంటోంది. పక్కా తెలుగు అమ్మాయి అయినప్పటికీ, ఎలాంటి సంకోచం లేకుండా తన అందాలతో హైలెట్ అవుతూ ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా మునుపెన్నడూ లేనంత గ్లామర్ తో సొగసులు చూపిస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల్లో విష్ణు ప్రియను చూడటానికి రెండు కళ్లు సరిపోవని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఆమె రెడ్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వేసిన డ్రెస్ హీటెక్కించేలా ఉందని మరికొందరు అంటున్నారు, ఆ డ్రెస్ పైన ఉన్న కలర్ మరియు మ్యాచింగ్ బ్రా ధరించి ప్రత్యేకమైన ఫోజులు ఇచ్చింది. ఇక ఆమె ఇచ్చిన స్టిల్స్ కు మరికొందరు ఫిదా అవుతున్నారు. గతంలో ఇంతకంటే ఘాటైన సొగసులతో అమ్మడు షాక్ ఇచ్చింది. కానీ ఈ స్టిల్స్ ప్రత్యేకంగా ఉన్నాయని అంటున్నారు. ఈ ఫోటోలు నెట్టింట్లో వేగంగా వైరల్ అయ్యాయి.

ఇటీవల విష్ణు ప్రియ టీవీ షోలలో ఎక్కువగా కనిపించకపోయినా, ఇతర షోలలో సందడి చేస్తోంది. అలాగే, వెబ్ సిరీస్ లలో కూడా తన ప్రతిభను చూపిస్తోంది. రీసెంట్ గా విడుదలైన "దయా" వెబ్ సిరీస్ లో షబానా అనే కీలక పాత్రలో నటించి మెప్పించింది. జేడీ చక్రవర్తితో కలిసి నటించిన ఈ సిరీస్, హాట్ స్టార్ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ అవుతోంది.

విష్ణు ప్రియ ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఆమె కెరీర్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను ఎలాంటివి అబ్బురపరుస్తుందో చూడాలి. ఆ మధ్య ఒక లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ వాటిపై అమ్మడు ఎలాంటి క్లారిటీ అయితే ఇచ్చింది లేదు. ఏదేమైనా, విష్ణు ప్రియ తన టాలెంట్, అందంతో ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతోంది.