విశ్వక్ సేన్ టాప్ బిజినెస్ మూవీస్.. లైలా స్థానం ఎంతంటే?
యంగ్ హీరో విశ్వక్ సేన్ తన యాటిట్యూడ్, మాస్ అప్పీల్, విభిన్నమైన కథా కథనాల ఎంపికతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు
By: Tupaki Desk | 13 Feb 2025 8:04 AM GMTయంగ్ హీరో విశ్వక్ సేన్ తన యాటిట్యూడ్, మాస్ అప్పీల్, విభిన్నమైన కథా కథనాల ఎంపికతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్స్‌పెరిమెంటల్ రోల్స్ చేయడంలో ముందుండే విశ్వక్, యూత్‌లో మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. విభిన్నమైన సినిమాలు, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తనకంటూ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాడు. కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేస్తున్నాడు.
ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తున్న లైలా మూవీపై టాలీవుడ్‌లో మంచి హైప్ క్రియేట్ అయింది. మొదటిసారి లేడి గెటప్ లో కనిపిస్తుండడంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. టీజర్, ట్రైలర్, లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘అటక్ మటక్’ లిరికల్ సాంగ్ తో మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్, మాస్ స్టెప్పులు సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ మూవీ ద్వారా విశ్వక్ తన యాక్టింగ్ స్కిల్స్‌లో మరో వైవిధ్యాన్ని చూపించబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వక్ సేన్ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కూడా తన సత్తా చాటుతున్నాడు. తాజాగా లైలా మూవీ వరల్డ్‌వైడ్‌గా 8.20 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. విశ్వక్ సేన్ సినిమా మార్కెట్ క్రమంగా పెరుగుతుండడం స్పష్టమవుతోంది. లాస్ట్ 6 సినిమాల టోటల్ బిజినెస్ 50 కోట్లకు చేరుకోవడం విశేషం. ఒక మిడిల్ రేంజ్ హీరోగా ఇలాంటి బిజినెస్ ఫిగర్స్ సొంతం చేసుకోవడం విశ్వక్ క్రేజ్‌ను రుజువు చేస్తోంది.
ఇందులో విశేషం ఏమిటంటే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (10.30 కోట్లు), గామి (10.20 కోట్లు) సినిమాలు విశ్వక్ సేన్ కెరీర్‌లో హయ్యెస్ట్ బిజినెస్ చేసిన సినిమాలు. ఈ రెండు సినిమాలు థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించి ప్రొడ్యూసర్స్‌కు లాభాలు తీసుకువచ్చాయి. విశ్వక్‌కు మంచి ఓపెనింగ్స్ రావడం, విభిన్నమైన కాన్సెప్ట్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం వల్ల అతని మార్కెట్ పెరుగుతోంది.
ఇప్పుడు లైలా మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్ల షేర్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు వచ్చిన రెస్పాన్స్ బట్టి ఈ టార్గెట్ అందుకోవడం విశ్వక్‌కి పెద్ద సమస్య కాకపోవచ్చని భావిస్తున్నారు. విశ్వక్ సేన్‌కు ఇది మరో హిట్‌గా నిలుస్తుందనే ఆశలు పక్కా.
విశ్వక్ సేన్ రీసెంట్ మూవీస్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు:
1.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – రూ. 10.30 కోట్లు
2.గామి – రూ. 10.20 కోట్లు
3.మెకానిక్ రాకీ – రూ. 8.50 కోట్లు
4.లైలా మూవీ – రూ. 8.20 కోట్లు
5.దాస్ కా ధమ్కీ – రూ. 7.50 కోట్లు
6.ఓరి దేవుడా – రూ. 5.50 కోట్లు