Begin typing your search above and press return to search.

లైలా 'అటక్ మటక్'.. విశ్వక్ సెన్ స్టెప్పులు అదుర్స్!

లేడీ గెటప్‌లో విశ్వక్ సెన్ ఎంటర్టైన్మెంట్‌కి ఈ పాట మరింత కలర్‌ను జోడించింది.

By:  Tupaki Desk   |   12 Feb 2025 3:16 PM GMT
లైలా అటక్ మటక్.. విశ్వక్ సెన్ స్టెప్పులు అదుర్స్!
X

విశ్వక్ సెన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లైలా' చిత్రం నుంచి మరో ఎనర్జిటిక్ సాంగ్ విడుదలైంది. ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో మంచి హైప్ తెచ్చుకుంది. తాజాగా ‘అటక్ మటక్’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజవ్వడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. లేడీ గెటప్‌లో విశ్వక్ సెన్ ఎంటర్టైన్మెంట్‌కి ఈ పాట మరింత కలర్‌ను జోడించింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి సాలీడ్ రెస్పాన్స్ వస్తోంది.

సినిమా మేకర్స్ విడుదల చేసిన ఈ లిరికల్ వీడియోలో విశ్వక్ సెన్ గెటప్‌ ఒక హైలైట్ అయితే, డ్యాన్స్ మూమెంట్స్ మరో హైలైట్‌గా నిలిచాయి. లైలా పాత్రలో విశ్వక్ సెన్ పర్ఫెక్ట్‌గా మిళితమైపోయాడు. పాట ప్రారంభమైన దగ్గర నుంచి అతని బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచాయి. అటక్ మటక్ అనే ట్యూన్ వినగానే ఆకట్టుకునేలా ఉండటంతో పాట వేగంగా వైరల్‌గా మారుతోంది.

ఈ పాటలో మరో విశేషం ఏమిటంటే, దీనికి లిరిక్స్ స్వయంగా విశ్వక్ సెన్ రాయడం. తనదైన యూనిక్ స్టైల్‌లో ఈ పాటను రాస్తూ అందులో ఫుల్ మాస్ యాంగిల్‌ చూపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ ఈ పాటకు క్యాచీ ట్యూన్ ఇచ్చారు. ప్రముఖ గాయకులు నకాష్ అజీజ్, ఆదితి భవరాజు ఆలపించిన ఈ పాటకు అద్భుతమైన ఎనర్జీ ఉంది. పాటలోని బీట్, విజువల్స్, డ్యాన్స్ మూమెంట్స్ అన్ని కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

విశ్వక్ సెన్ లేడీ గెటప్‌లో కనిపించడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్స్ లోనే లైలా లుక్ ఆసక్తిని పెంచింది. అయితే ఈ సాంగ్‌లో అతని డ్యాన్స్, మాస్ స్టెప్పులు మరింత హైలైట్ అయ్యాయి. ప్రత్యేకంగా ఈ పాటలో అతని హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూసిన వారు విశ్వక్ సెన్ యాక్టింగ్ రేంజ్ గురించి ప్రశంసిస్తున్నారు.

సినిమాపై అంచనాలను పెంచేలా ఈ పాట ఉండటంతో, ఫిబ్రవరి 14న విడుదలయ్యే లైలా మూవీ బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం టీమ్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఇతర సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేయగా, ‘అటక్ మటక్’ సాంగ్ ఆ హైప్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. సినిమా మ్యూజికల్‌గా కూడా హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి సినిమా ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.