టాలీవుడ్ డైరెక్టర్ కథతో ఫంకీ..!
అంతకుముందు అమ్మడు శ్రీ విష్ణు తో అల్లూరి సినిమాలో నటించింది కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు.
By: Tupaki Desk | 27 March 2025 3:30 PMసితార బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరోగా ఫంకీ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాను జాతిరత్నాలు ఫేం అనుదీప్ కెవి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. ఈమధ్యనే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో యూత్ ఆడియన్స్ మనసులు కొల్లగొట్టిన కయదు లోహార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతకుముందు అమ్మడు శ్రీ విష్ణు తో అల్లూరి సినిమాలో నటించింది కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ డ్రాగన్ హిట్ అయ్యే సరికి కయదు వెంట తెలుగు మేకర్స్ పడుతున్నారు.
ఇదిలాఉంటే సితార నాగ వంశీ ఫంకీ సినిమా కథ గురించి స్టోరీ లీక్ చేశారు. ఈ సినిమా ఒక యంగ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూతురు లవ్ స్టోరీ అని అన్నాడు. సినిమా అంతా కూడా హీరోయిన్ డామినేషన్ ఉంటుందని అన్నాడు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇది మరో గీతా గోవిందం అవుతుందని అన్నారు నాగ వంశీ. అంతేకాదు ఈ సినిమా కథ నాగ్ అశ్విన్ బయోపిక్ లా ఉంటుందని అన్నారు.
మరి అనుదీప్ కెవి అలా చెప్పి ఈ సినిమా ఓకే చేసుకున్నారా లేదా నాగ వంశీ కథ విని అలా అన్నారా తెలియదు కానీ నాగ్ అశ్విన్ బయోపిక్ గా ఫంకీ అంటూ నాగ వంశీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు ఇది మరో గీతా గోవిందం అవుతుందని చెప్పడం విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈమధ్య సినిమాలు చేస్తున్నా కూడా ఫలితాలు అంత సాటిస్ఫైడ్ గా ఉండని విశ్వక్ సేన్ అనుదీప్ తో ఫంకీతో ష్యూ షాట్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
అనుదీప్ డైరెక్షన్ పై ఆడియన్స్ లో ఒక గట్టి నమ్మకం ఉంది. అతను కనిపిస్తేనే ఆడియన్స్ క్రేజీగా ఫీల్ అవుతుంటారు. అలాంటి అనుదీప్ ఫంకీతో వస్తున్నాడు అంటే కచ్చితంగా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలో కయదు లోహార్ హీరోయిన్ కాబట్టి అమ్మడికి తెలుగులో మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని చెప్పొచ్చు.
ప్రిన్స్ సినిమా తర్వాత అనుదీప్ చేస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే ఆడియన్స్ లో ఒక బజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు సితార నాగ వంశీ కథ ఇదే అని చెప్పడంతో సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడుతుంది. మరి జాతిరత్నాలు మార్క్ సినిమా ఫంకీ అవుతుందా లేదా అన్నది చూడాలంటే సినిమా రావాల్సిందే.