విశ్వక్ లైలా కోసం మెగాస్టార్?
విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.
By: Tupaki Desk | 6 Feb 2025 11:34 AM GMTవిశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ మూవీ లైలా. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించాడు. లైలా సినిమాలో విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న లైలా 135 నిమిషాల రన్ టైమ్ తో సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ అందుకుంది. టాలెంటెడ్ నటుడిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఈ సినిమాలో మొదటిసారి లేడీ గెటప్ లో కనిపించి సరికొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయ్యాడు.
ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో లైలా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మమ్మురం చేసింది. అందులో భాగంగానే ఫిబ్రవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకురానున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఈ వార్త విన్న నెటిజన్లు మొన్నటివరకు నందమూరి బాలకృష్ణను తన సినిమా ఈవెంట్లకు తీసుకొచ్చి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న విశ్వక్, ఇప్పుడు లైలా కోసం ఏకంగా మెగాస్టార్ ను లైన్ లోకి దింపుతున్నాడని, సీనియర్ హీరోలను కన్విన్స్ చేయడంలో నీ తర్వాతే ఎవరైనా అని విశ్వక్ గురించి కామెంట్ చేస్తున్నారు.
ఈ జెనరేషన్ హీరోల్లో లేడీ గెటప్స్ ఎవరూ చేయకపోయినా విశ్వక్ ఆ ధైర్యం చేశాడు. గతంలో ఇప్పటికే పలువురు సీనియర్ హీరోలు లేడీ గెటప్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశ్వక్ కూడా అలాంటి జానర్ సినిమాల్లో నటించి, స్టార్ హీరోలను ఫాలో అవుతున్నాడని చెప్పొచ్చు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా లేడీ గెటప్ లో కనిపించిన విషయం తెలిసిందే.