Begin typing your search above and press return to search.

ప్రివ్యూ చూసి ఎవరైనా బాలేదని చెబితే, థియేటర్లకు రాకండి: విశ్వక్ సేన్

తాజాగా మేకర్స్ హైదరాబాద్ మూసాపేట శ్రీరాములు థియేటర్లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 3:48 AM GMT
ప్రివ్యూ చూసి ఎవరైనా బాలేదని చెబితే, థియేటర్లకు రాకండి: విశ్వక్ సేన్
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ మూవీ ''మెకానిక్ రాకీ''. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ హైదరాబాద్ మూసాపేట శ్రీరాములు థియేటర్లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ''ఇప్పుడున్న పరిస్థితుల్లో సంవత్సరానికి మూడు సినిమాలు రిలీజ్ చేయడం చాలా తక్కువ మందికి కుదురుతుంది. ఇంతదూరం వచ్చానంటే ఈ జర్నీలో ఇద్దరే వున్నారు. ఒకటి నేను, రెండు మీరు(అభిమానులు). ఏ సపోర్ట్ లేకుండానే నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది మీరే. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. నిజంగా మీరు లేకపోతే నేను ఈ స్టేజికి వచ్చేవాడిని కాదు. ఇది చాలా ఎమోషనల్ డే. నవంబర్ 22న సినిమా రిలీజ్. సినిమాకి బజ్ వస్తలేదు అని చాలామంది అంటున్నారు. నేనే బజ్ ఇవ్వలేదు. ఈరోజు నుంచే బజ్ ఇద్దామని నేను డిసైడ్ అయ్యా. మనందరం కలిసి బజ్ ఇస్తున్నాం'' అని అన్నారు.

''సినిమా మొన్న చూసుకున్నా. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే.. 22 సినిమా రిలీజ్ ఉంటే నవంబర్ 21న 7.30కి పెయిడ్ ప్రివ్యూలు వేస్తున్నాం. యూఎస్ షో కంటే ముందే చూసుకుకోండి. ప్రివ్యూ చూసినోడు సినిమా బాగాలేదు అంటే 22న థియేటర్ కు రాకండి. అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. కచ్చితంగా సినిమా ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు. క్లైమాక్స్ అయితే రెండోసారి సినిమా చూద్దాం అనుకునే రేంజ్ లో వుంది. సెకండ్ హాఫ్ లో థియేటర్స్ అన్నీ అడిటోరియమ్ లా మారిపోతాయి. రాసిపెట్టుకోండి. ఇది ట్రైలర్ 1.0. మాత్రమే. రిలీజ్ దగ్గరలో మరో ట్రైలర్ 2.0 రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్ కి ఇది ట్రైలర్ అనుకోండి.''

''నిర్మాత రామ్ తాళ్లూరి గారు చాలా సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమాలో ఆయనకి చాలా డబ్బులు రావాలి. నాకు కూడా చాలా డబ్బులు రావాలి. శ్రద్ధ శ్రీనాథ్ వండర్ ఫుల్ కో స్టార్. మీనాక్షి ఇతర షూటింగ్స్ తో బిజీగా ఉండి రాలేకపోయింది. ఆమెకి కూడా థాంక్యూ సో మచ్. మా ముగ్గురి కెమిస్ట్రీని, ట్రయాంగిల్ లవ్ స్టోరీని అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ రవి థాంక్యూ సో మచ్. డీఓపీ మనోజ్ రెడ్డి ఈ సినిమా తర్వాత ఒక రేంజ్ కి వెళ్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ బిజోయ్ గురించి స్పెషల్ గా చెప్పాలి. మొన్న 'సరిపోదా శనివారం' సినిమాకు ఏం చేసాడో మీరంతా చూసారు. 'మెకానికి రాకీ'తో అతని హిట్ స్ట్రీక్ కంటిన్యూ కాబోతోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. టీంలో ప్రతి ఒక్కరం పోటాపోటీగా పనిచేశాం. నవంబర్ 22న థియేటర్స్ లో కలుద్దాం. లవ్ యూ'' అని విశ్వక్ సేన్ అన్నారు.

''మెకానిక్ రాకీ'' చూసి ఇలా మాట్లాడాడు అంటే ఈ సినిమాపై విశ్వక్ సేన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికైతే ఈ మూవీ ఫస్ట్ గేర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, మాస్.. అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ఈ యాక్షన్‌ ప్యాక్డ్ ట్రైలర్ 1.0ను కట్ చేసారు. ఇది మాస్ కా దాస్ మాస్ అప్పీల్‌ను సరిగ్గా ప్రజెంట్ చేసింది. ఇందులో డైలాగ్స్ కూడా అభిమానులను అలరిస్తున్నాయి. మరి ఈ సినిమా విశ్వక్ సేన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.