విశ్వక్ 'లైలా'.. మాస్ కా దాస్ నెవ్వర్ బిఫోర్ లుక్
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 25 Dec 2024 6:48 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న ఆయన.. ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు. తన యాక్టింగ్ తో సినీ ప్రియులను తెగ అలరిస్తున్నారు.
2024లో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలతో సందడి చేసిన విశ్వక్.. ఇప్పుడు వివిధ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. అందులో లైలా ఒకటి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.
కొత్త అందం ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్న లైలా మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. సినిమాలో కాసేపు అమ్మాయి రోల్ లో కనిపించనున్న విశ్వక్ లుక్ ను కొద్ది రోజుల క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు. కళ్లు మాత్రమే చూపించినా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత స్టైలిష్ మోడ్ లో ఉన్న విశ్వక్ పోస్టర్ షేర్ చేశారు.
అయితే వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ కానున్న లైలా.. మూవీ నుంచి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. క్రిస్మస్ కానుకగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో విశ్వక్ సేన్.. స్టైలిష్ అండ్ రిచ్ కిడ్ లా కనిపిస్తున్నారు. గోల్డెన్ వాచ్, పెద్ద గొలుసులు వేసుకుని అన్నారు. ఆయన చేతులపై ఉన్న టాటూస్ అట్రాక్షన్ గా నిలిచాయి.
సోనూ లవర్, సోనూ కిల్లర్ అని టాటూస్ ఉండగా.. విశ్వక్ బోల్డ్ సింబల్స్ బట్టి చూస్తే ఆయన రోల్ సినిమాలో విభిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొత్త పోస్టర్ వైరల్ గా మారగా నెటిజన్లు స్పందిస్తున్నారు. మూవీపై అంచనాలు పెరుగుతున్నాయని, సినిమాలో విశ్వక్ ఫుల్ వెరియేషన్స్ చూపించనున్నట్లు తెలుస్తోందని అంటున్నారు.
ఇక లైలా సినిమా క్రూ విషయానికొస్తే.. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందిస్తుండగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మూవీ నుంచి న్యూ ఇయర్ కు మరో అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.