చిరంజీవితో విశ్వక్ సేన్.. విషయమేమిటంటే?
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 Feb 2025 10:51 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న విశ్వక్.. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన లైలాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. కెరీర్ లో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించనున్నారు విశ్వక్.
సినిమాలో కొత్త బ్యూటీ ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆ విషయం రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో అర్థమైంది. అదే సమయంలో మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది.
అయితే లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే నిర్వహించనున్నారు మేకర్స్. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. తాజాగా చిరును విశ్వక్ సేన్, సాహు గారపాటి వెళ్లి కలిశారు.
తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాల్సిందిగా మెగాస్టార్ ను ఆహ్వానించారు. అందుకు సంబంధించిన పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరుకు ఆయన ఇష్టదైవమైన పంచముఖ ఆంజనేయుడి విగ్రహాన్ని విశ్వక్ బహుకరించారు. అంతే కాదు.. గజమాలతో సత్కరించినట్లు కూడా ఫోటోస్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది.
అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చేందుకు చిరు అంగీకారం తెలిపినట్టు విశ్వక్ సేన్ తెలిపారు. "ఆహ్వానాన్ని మన్నించి మా లైలాకు మద్దతు ఇవ్వడానికి రానున్న వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. సినిమాకు మీరు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తునందుకు చాలా కృతజ్ఞతలు అంటూ విశ్వక్ రాసుకొచ్చారు.
దీంతో లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా రావడం కన్ఫర్మ్ అయినట్లే. అయితే ఈవెంట్ ను లైలా మేకర్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారని తెలుస్తోంది. చిరు వస్తుండడంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. కానీ ఎక్కడ? ఎప్పుడు? అనేది మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తారో చూడాలి.