Begin typing your search above and press return to search.

ఖుదూస్ టు లక్కీ భాస్కర్.. మాస్ కా దాస్ ట్వీట్ వైరల్..!

ఇంతకీ విశ్వక్ ఏం మెసేజ్ పెట్టాడు అంటే నిన్న రాత్రి లక్కీ భాస్కర్ చూశా.. ఇది కచ్చితంగా తెలుగులో అద్భుతమైన సినిమా వెంకీ అట్లూరి ఫిల్మ్ మేకర్ గా నెక్ట్ లెవెల్ కు వెళ్లాడు.

By:  Tupaki Desk   |   3 Nov 2024 9:20 AM GMT
ఖుదూస్ టు లక్కీ భాస్కర్.. మాస్ కా దాస్ ట్వీట్ వైరల్..!
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ గా తన ఎక్స్ ఖాతాలో ఒక సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. ఇంతకీ విశ్వక్ ఏం మెసేజ్ పెట్టాడు అంటే నిన్న రాత్రి లక్కీ భాస్కర్ చూశా.. ఇది కచ్చితంగా తెలుగులో అద్భుతమైన సినిమా వెంకీ అట్లూరి ఫిల్మ్ మేకర్ గా నెక్ట్ లెవెల్ కు వెళ్లాడు. దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ కెరీర్ బెస్ట్ గా ఉంది. సినిమా టీం అంతా కూడా ఇంప్రెసివ్ వర్క్ చేశారు. మీనాక్షి చౌదరి కూడా తన ప్రతిభ కనబరచింది. జివి ప్రకాష్ పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. వంశీ అన్నకు మరోసారి కంగ్రాట్స్. ఇలాంటి సినిమాను తెలుగు ఆడియన్స్ ముందుకు తెచ్చినందుకు కంగ్రాట్స్. ఈ సినిమా ఇంకా చాలా దూరం వెళ్తుంది. ఖుదూస్ టూ టీం అంటూ కామెంట్ పెట్టారు.

విశ్వక్ సేన్ ఈమధ్య కాలంలో ఏ సినిమాకు ఇలాంటి మెసేజ్ పెట్టలేదు. తనకు ఎంతగానో నచ్చితేనే కానీ ఈ మెసేజ్ పెట్టే అవకాశం లేదు. సో విశ్వక్ మాటలను బట్టి చూస్తేనే తనకు ఎంతగా నచ్చిందో అర్థమవుతుంది. లక్కీ భాస్కర్ సినిమా 1980-90 కాలం లో బ్యాంకింగ్ నేపథ్యంతో తెరకెక్కింది. దీపావళికి మరో రెండు సినిమాల మధ్య రిలీజైన లక్కీ భాస్కర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

లక్కీ భాస్కర్ సినిమాతో మరోసారి దుల్కర్ సల్మాన్ స్టోరీ సెలక్షన్స్ ఎంత స్ట్రాంగ్ అన్నది అర్థమవుతుంది. తెలుగులో మహానటితో తొలి హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ ఆ తర్వాత సీతారామం తో హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. చిత్ర యూనిట్ మొదటి నుంచి ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఐతే ఆడియన్స్ మాత్రం సినిమాను ఊహించిన దాని కన్నా ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు.

లక్కీ భాస్కర్ తో పాటుగా రిలీజైన కిరణ్ అబ్బవరం క, శివ కార్తికేయన్ అమరన్ సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా లక్కీ భాస్కర్ పై విశ్వక్ సేన్ ట్వీట్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. మరి లక్కీ భాస్కర్ కి విశ్వక్ చెప్పినట్టు లాంగ్ రన్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. కమర్షియల్ లెక్కలు చూడకుండా ఉంటే లక్కీ భాస్కర్ ది బెస్ట్ మూవీ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.