మసూద డైరెక్టర్ తో విశ్వక్ మూవీ?
విశ్వక్ ఓ వైపు ఫంకీ సినిమా చేస్తూనే తన తర్వాతి సినిమాల కోసం కథలు వింటున్నాడు.
By: Tupaki Desk | 7 March 2025 9:13 AM ISTటాలీవుడ్ లో నటుడిగా, రైటర్ గా, డైరెక్టర్ గా విశ్వక్ సేన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ ను అలరించే విశ్వక్ సేన్ రీసెంట్ గా చేసిన లైలా సినిమా డిజాస్టర్ గా నిలిచింది. లైలాతో కూడా విశ్వక్ డిఫరెంట్ ప్రయత్నమే చేశాడు. ఈ సినిమా కోసం ఎవరూ వేయని ఆడవేషం కూడా వేశాడు విశ్వక్.
కానీ ఆ సినిమాకు విశ్వక్ పడ్డ కష్టమంతా బూడిదలో పోసినట్టే అయింది. దీంతో ఇకపై మంచి సినిమాలే చేస్తానని, ప్రతీ సీన్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానని, లైలా లాంటి సినిమాలు చేయనని లెటర్ ద్వారా అందరికీ తెలిపిన విశ్వక్ ప్రస్తుతం జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కె.వి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫంకీ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనున్నట్టు సమాచారం.
విశ్వక్ ఓ వైపు ఫంకీ సినిమా చేస్తూనే తన తర్వాతి సినిమాల కోసం కథలు వింటున్నాడు. లైలా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు విశ్వక్. అయితే రీసెంట్ గా విశ్వక్ సేన్ కు మసూద డైరెక్టర్ సాయి కిరణ్ ఓ కథ చెప్పారట. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనున్న ఈ సినిమాకు విశ్వక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
ఫంకీ సినిమా పూర్తయ్యాక మసూద డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇది కాకుండా ఏమైంది ఈ నగరానికి సినిమాకు సీక్వెల్ ను కూడా విశ్వక్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మసూద లాంటి సూపర్ హిట్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ తో పాటూ ఈ నగరానికి ఏమైంది లాంటి హిట్ సినిమాకు సీక్వెల్ తో విశ్వక్ లైనప్ బాగానే ఉంది. అయితే విశ్వక్ సేన్ కు ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.