Begin typing your search above and press return to search.

బేబీ... నేను బిర్యానీ కాదు: విశ్వక్ సేన్

అందరినీ ఆనందంగా ఉంచేందుకు తానేమీ బిర్యానీ కాదంటూ సినిమా, దర్శకుడి పేరుని ప్రస్తావించకుండానే వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   27 July 2023 5:05 AM GMT
బేబీ... నేను బిర్యానీ కాదు: విశ్వక్ సేన్
X

టాలెంటెడ్ యంగ్ హీరీల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. కేవలం హీరోగా నటించడమే కాదు, డైరెక్షన్ బాధ్యతలు కూడా పూర్తిగా నిర్వహించగల సత్తా ఉన్నోడు. తాను నటించిన రెండు సినిమాలకు ఆయనే స్వయంగా డైరెక్షన్ చేసి వ్హా అనిపించుకున్నాడు. ఆ రెండు సినిమాలు అనుకన్నంత హిట్ కాకపోయినా, ఆయనలోని డైరెక్టర్ మాత్రం అందరికీ నచ్చేశాడు.ఇటీవల దాస్ కా దమ్కీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా నెగిటివ్ రోల్ లో ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

కాగా, విశ్వక్ ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబీ మూవీ ముందు ఆఫర్ విశ్వక్ సేన్ కే వచ్చింది. అయితే, కనీసం విశ్వక్ కథ కూడా వినడానికి ఆసక్తి చూపించలేదు అనే విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. ఈ విషయం పై సమయం వచ్చినప్పుడల్లా విశ్వక్ స్పందిస్తూనే ఉన్నాడు.

మొన్నటికి మొన్న 'నో అంటే నో అనేది మగవాళ్లకు కూడా వర్తిస్తుంది. అందుకే ప్రశాంతంగా, కూల్ గా ఉండండి. ప్రశాంతతను పంచండి. రిలాక్స్ అవ్వండి' అంటూ ట్వీట్ చేశాడు. అక్కడితో ఆగిపోలేదు.

తాజాగా మరోసారి ఇదే విషయం పై మాట్లాడటం విశేషం. నిన్న రాత్రి జరిగిన 'పేకమేడలు' సినిమా టీజర్ విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఇటీవల జరిగిన కాంట్రవర్సీపై స్పందించాడు. అందరినీ ఆనందంగా ఉంచేందుకు తానేమీ బిర్యానీ కాదంటూ సినిమా, దర్శకుడి పేరుని ప్రస్తావించకుండానే వ్యాఖ్యలు చేశాడు.

'ఎవరి పనిని బట్టి వారు బిజీగా ఉంటారు. ఎలాంటి సినిమాలు చేయాలి అనే క్లారిటీ లేనప్పుడు వేరే వారి సలహా తీసుకుంటాం. ఒక్కోసారి ఎదుటివారి టైమ్ వేస్ట్ చేయకూడదనుకుంటాం. అందుకే 'కలవలేం, కథ వినలేం' అని దర్శకుడికి చెబుతుంటాం.

దానికి కొంతమంది ఫీలవుతుంటారు. ఆ విషయంలో నేనేం చేయలేను కదా. అందరినీ ఆనందంగా ఉంచేందుకు నేను బిర్యానీని కాదు. మన సినిమా విజయవంతమైతే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ, సినిమా బాగుందని ఇతరులను కించపరచొద్దు.

అదొక్కటి బాధగా ఉంది. చిన్న సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండడం అందరూ సంతోషించే విషయం. ఆ చిత్ర టీమ్ కి నేను శుభాకాంక్షలు కూడా చెప్పా. సినిమా ట్రైలర్‌ బాగుందని వాట్సాప్‌ గ్రూప్‌లో ముందుగా మెసేజ్‌ చేసింది నేనే. అయినా, దర్శకుడిని నేను కలవలేదంటూ మీమ్స్‌ వచ్చాయి. గంట చర్చించి నో చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్‌ అనుకుని చెప్పా'అన్నారు.

బేబీ సినిమా ఈవెంట్ లో భాగంగా దర్శకుడు చెప్పిన మాటలకు విశ్వక్ బాగా హర్ట్ అయ్యాడనే విషయం అర్థమౌతోంది. అందుకే, ఆయన ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ, తన తప్పు ఏదీ లేదు అనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.