Begin typing your search above and press return to search.

సడన్ గా తప్పుకున్న విశ్వక్.. ఎందుకంటే..

వాటిలో మెకానిక్ రాకీ మూవీ రిలీజ్ షూటింగ్ చివరి దశలో ఉంది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 11:25 AM GMT
సడన్ గా తప్పుకున్న విశ్వక్.. ఎందుకంటే..
X

యంగ్ హీరో విశ్వక్ సేన్ డిఫరెంట్ కథలతో మూవీస్ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ విశ్వక్ తన స్టార్ స్టామినాతో బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ను ఫినిష్ చేశాడు. ఇక ప్రస్తుతం విశ్వక్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో మెకానిక్ రాకీ మూవీ రిలీజ్ షూటింగ్ చివరి దశలో ఉంది.

ఈ మూవీలో మీనాక్షి చౌదరి విశ్వక్ సేన్ కి జోడీగా నటిస్తోంది. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో సోషల్ మీడియాలో కొంతమంది కావాలని టార్గెట్ చేస్తూ ఉంటారు. విశ్వక్ సేన్ కూడా వాటిపై సీరియస్ గానే రియాక్ట్ అవుతారు. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ వలన కొన్నిసార్లు స్టార్స్ చాలా ఇబ్బంది పడతారు. తాజాగా కల్కి సినిమా రిలీజ్ కాకుండానే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీనిపై విశ్వక్ సేన్ కూడా తిరిగి కౌంటర్ ఇచ్చారు.

అయితే ఇది కాస్త కాంట్రవర్సీగా మారడంతో విశ్వక్ సేన్ సైలెంట్ అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రామ్ డిలేట్ చేసాడు. కారణం ఏంటనేది తెలియకపోయిన పూర్తిగా డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాల మీద ఫోకస్ చేసే ఉద్దేశ్యంతోనే సోషల్ మీడియాకి దూరంగా ఉండటానికి విశ్వక్ సేన్ ఆ విధంగా నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మెకానిక్ రాకీ మూవీ తర్వాత దాస్ కా దమ్కీ సీక్వెల్ కూడా విశ్వక్ సేన్ చేయబోతున్నాడు. అలాగే మరో మూవీ కూడా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ట్విట్టర్ లో కూడా విశ్వక్ చాలా సైలెంట్ అయ్యారు. విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రామ్ కి దూరం కావడంతో ఆయన సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మీమ్స్ క్రియేట్ చేస్తూ విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రామ్ మళ్ళీ యాక్టివేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

గతంలో కూడా విశ్వక్ సేన్ చాలా కాంట్రవర్సీలలో ఇరుక్కున్నారు. అయితే అన్నింటికి విశ్వక్ సేన్ కేవలం తన సినిమాలు, పెర్ఫార్మెన్స్ తోనే సమాధానం చెబుతూ వచ్చాడు. కచ్చితంగా ఈ సారి కూడా తన సినిమాల ద్వారానే విశ్వక్ సేన్ తిరిగి అందరికి సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని అభిమానులు అంటున్న మాట.