ఆ సినిమాకు విశ్వక్ ఫస్ట్ ఆడిషన్
ఆయన నాలుగేళ్లుగా వర్క్ చేస్తున్న గామి మూవీ.. శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన రిలీజ్ కానుంది.
By: Tupaki Desk | 16 Feb 2024 2:30 PM GMTటాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. తెలుగు ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ గా దూసుకెళ్తున్నారు. అటు హీరోగా , రైటర్ గా, ఇటు దర్శకుడిగా, నిర్మాతగా అలా అన్నీ బాధ్యతలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడుతారు. ముక్కుసూటిగా ఆన్సర్లు ఇస్తుంటారు. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో మాస్ లుక్ లో కనిపిస్తుంటారు. అందుకే మరి ఆయనకు మాస్ కా దాస్ ట్యాగ్ వచ్చింది.
ఇక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు విశ్వక్ సేన్. ఆయన నాలుగేళ్లుగా వర్క్ చేస్తున్న గామి మూవీ.. శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన రిలీజ్ కానుంది. దాంతోపాటు ఆయన నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు కాకుండా తన చేతిలో మరో మూడు మూవీలు ఉన్నట్లు ఇటీవలే విశ్వక్ తెలిపారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విశ్వక్ సేన్. తన ఫస్ట్ మూవీ ఆడిషన్ గురించి వివరించారు. ఇటీవలే ఓ డైరెక్టర్ మీడియా ముందుకు కంప్లైంట్ ఇచ్చిన విషయంపై కూడా మాట్లాడారు. అయితే విశ్వక్ ను చాలా మంది హీరోలా ఉన్నావని అనేవారట. అది సీరియస్ గా తీసుకున్న విశ్వక్.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారట. తాను ఆడిషన్ కు వెళ్లిన ఫస్ట్ మూవీ జోష్ అని చెప్పారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. జోష్ మూవీ కోసం కొత్త వాళ్లను తీసుకుంటున్నట్లు టీవీలో ప్రకటన ఇచ్చారట. అది చూసిన విశ్వక్ ఆడిషన్ కు వెళ్లారట. కానీ అది వర్కౌట్ కాలేదని ఆయన తెలిపారు. తాను ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని, కొన్నిసార్లు కనీసం గేటు కూడా దాటలేకపోయినట్లు గుర్తుచేసుకున్నారు. అవన్నీ అందరికీ చెప్పి.. సింపతీ కొట్టాల్సిన అవసరం తనకు లేదని, అలా నచ్చదని అన్నారు.
కొన్ని రోజుల క్రితం ఓ డైరెక్టర్.. విశ్వక్ గురించి మీడియా ముందు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ దర్శకుడు విశ్వక్ ఇంటికి కూడా వెళ్లారట. ఆ విషయంలో చాలా జరిగిందట. కానీ ఆ ఇష్యూపై ఎక్కడ మాట్లాడనని ఫిక్స్ అయినట్లు చెప్పారు విశ్వక్. కొన్ని విషయాల్లో సైలెంట్ గా ఉండడమే బెటర్ అని తెలిపారు. ఇటీవలే రామ్ చరణ్ ను మీట్ అయ్యానని, బట్ ఏం మాట్లాడారని అడగొద్దని అన్నారు. మరి వారిద్దరు మాట్లాడుకుంటున్నారో ఏంటో.