Begin typing your search above and press return to search.

బాలయ్య, తారక్.. విశ్వక్ ఏం అన్నారంటే?

మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా అని చిత్ర యూనిట్ నమ్మకంతో చెబుతోంది.

By:  Tupaki Desk   |   30 May 2024 12:54 PM GMT
బాలయ్య, తారక్.. విశ్వక్ ఏం అన్నారంటే?
X

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తనదైన యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే గామితో మంచి హిట్ అందుకున్న విశ్వక్.. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సందడి చేయనున్నారు. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యి ఉంది. మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా అని చిత్ర యూనిట్ నమ్మకంతో చెబుతోంది.

కొన్ని కారణాల వల్ల పలుమార్లు రిలీజ్ వాయిదా పడినా.. మూవీ ప్రమోషన్స్ ను మాత్రం సాలిడ్ గా నిర్వహించారు మేకర్స్. వరుస అప్డేట్లతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. రిలీజ్ ట్రైలర్ సహా వివిధ గ్లింప్సెస్ తో మూవీ కచ్చితంగా చూడాలనేలా హైప్ సృష్టించారు. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో విశ్వక్ సేన్.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకునేటట్లు కనిపిస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. నందమూరి వారసులైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి కనిపించి కూడా చాలా రోజులైంది. అయితే వారిద్దరితో విశ్వక్ మాత్రం క్లోజ్ గా ఉంటారు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే విశ్వక్ ఓ రేంజ్ లో సందడి చేస్తారు. ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు. మరోవైపు, బాలయ్య ఇటీవల జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

విశ్వక్ తనకు అన్న లాంటి వారని సరదాగా చెప్పారు. దీంతో బాలయ్య, తారక్ మధ్య రిలేషన్ ఎలా ఉన్నా.. వారితో విశ్వక్ మాత్రం బాగానే ఉంటున్నారు. ఈ విషయంపై ఆయన తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. అటు బాలయ్య క్యాంప్ లో.. ఇటు తారక్ క్యాంప్ లో ఎలా ఉన్నారని అడగ్గా.. ఆ విషయంపై స్పందించనని పరోక్షంగా చెప్పారు విశ్వక్. తాను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కోసమే మాట్లాడతానని తెలిపారు.

మరోవైపు, గామి మూవీ రేటింగ్ విషయంలో నెలకొన్న వివాదంపై మాట్లాడారు విశ్వక్. "చాలామంది సినిమాకు 9.5తోపాటు పలు రేటింగ్ ఇచ్చారు. కొందరు 1 ఇచ్చారు. దీంతో యావరేజ్ రేటింగ్ తగ్గిపోతుంది. అందుకే స్పందించా. చేసింది ఎవరో తెలియదు. అందుకే క్రిటిసైజ్ చేయలేదు. ఎవరు చేశారో చెప్తే క్రిటిసైజ్ చేస్తా. గామి అనుకున్నంత స్థాయి కన్నా పెద్ద హిట్ అయింది" అని చెప్పారు. మరి GOG ఎలా ఉంటుందో చూడాలి.