Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్ ఎంత స్పీడ్ అంటే..

ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ రామ్ నారాయణ దర్శకత్వంలో లైలా అనే సినిమాకి ఇప్పటికే మొదలుపెట్టారు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 3:45 AM GMT
విశ్వక్ సేన్ ఎంత స్పీడ్ అంటే..
X

యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అందరికంటే వేగంగా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యాయి. ప్రస్తుతం రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో దర్శకత్వంలో మెకానిక్ రాకీ అనే చిత్రంతో థియేటర్స్ లోకి రావడానికి విశ్వక్ సేన్ రెడీ అవుతున్నారు. అక్టోబర్ 31న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ రామ్ నారాయణ దర్శకత్వంలో లైలా అనే సినిమాకి ఇప్పటికే మొదలుపెట్టారు. మరోవైపు తాజాగా శ్రీధర్ గంట దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని లాంచ్ చేశారు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో విశ్వక్ సేన్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫ్రీ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ మూవీని గ్రాండ్ గా ప్రారంభించారు. విశ్వంభర మూవీ దర్శకుడు వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి క్లాప్ కొట్టి లాంచ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే యాక్షన్ మూవీగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో కన్నడ బ్యూటీ సంపాద టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. కన్నడంలో కరావలి అనే సినిమాతో ఈమె హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. అప్పుడే టాలీవుడ్ లోకి గ్రాండ్ గా సంపాద ఎంట్రీ ఇస్తోంది. చాలా మంది కన్నడ భామలు తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు వారి తరహాలోనే విశ్వక్ సేన్ మూవీతో సూపర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్ గా టాలీవుడ్ కెరియర్ స్టార్ట్ చేయాలని సంపాద అనుకుంటుంది. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించబోతున్నారంట. వీటి తర్వాత జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ మూవీ చేయబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో కూడా పవర్ పేట మూవీ ఉండబోతుందని సమాచారం.

అలాగే దాస్ కా దమ్కీ సీక్వెల్ కూడా విశ్వక్ సేన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అనేది తెలియాల్సి ఉంది. మెకానిక్ రాకీ రిలీజ్ కాబోతుండగా రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిని ముగించుకొని మిగిలిన సినిమాలు స్టార్ట్ చేస్తారా లేదంటే ముందుగానే ప్రారంభిస్తారా అనేది తెలియాల్సి ఉంది.