మాస్ కా విశ్వక్.. స్టైలే వేరు!
యంగ్ హీరో విశ్వక్ సేన్.. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు
By: Tupaki Desk | 2 Jan 2024 7:25 AM GMTయంగ్ హీరో విశ్వక్ సేన్.. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. మాస్ దా దాస్ అనిపించుకున్నారు. కొన్ని సినిమాల అనుభవమే ఉన్నా.. నిర్మాతగా కూడా మారారు. సొంత బ్యానర్ ను ప్రారంభించి తన సినిమాలను తానే నిర్మించుకున్నారు. ఓ సినిమాకు దర్శకుడిగా, రచయితగా కూడా వ్యవహరించారు. మల్టీటాలెంటెడ్ గా దూసుకుపోతున్నారు.
కానీ మొదటిసారి తను మాత్రమే నిర్మాతగా వ్యవహరిస్తూ.. కొత్త నటీనటులతో కల్ట్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు విశ్వక్. కల్ట్ లో తను హీరోగా నటించకుండా కొత్తవారిని తీసుకుంటున్నారు. మజా కోసమే ఈ మూవీ నిర్మిస్తున్నట్లు ఇటీవలే చెప్పారు. అయితే ఇప్పుడు విశ్వక్ సినిమాల టైటిల్స్ పై నెట్టింట చర్చ మొదలైంది. ట్రెండింగ్ పదాలను టైటిల్స్ గా పెడుతూ సినీ ప్రియులను చూపును తనవైపు తిప్పుకుంటున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు.
బ్లాక్ బస్టర్ గా నిలిచిన బేబీ మూవీ తర్వాత కల్ట్ అనే వర్డ్ ఫుల్ ట్రెండ్ అయింది. ఇప్పుడు ఆ పదాన్ని విశ్వక్ తన సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నారు. విశ్వక్ సేన్ మరో మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఆ నదీ తీరప్రాంతాల ప్రజలను సినిమాతో ఫుల్గా కనెక్ట్ చేస్తుంది. విదేశాల్లో ఉన్న గోదావరి తీర ప్రాంతాలకు చెందిన ప్రజలను కూడా అట్రాక్ట్ చేస్తుంది. అలా సినిమా మంచి క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంది. 2022లో వచ్చిన విశ్వక్ ఓరి దేవుడా మూవీ టైటిల్ కూడా అప్పట్లో ట్రెండ్ అయింది.
కేజీఎఫ్ రెండు భాగాల్లో రాకీభాయ్ గా అలరించిన కన్నడ స్టార్ హీర యశ్.. తన నెక్స్ట్ మూవీకి మెకానిక్ రాకీ అని పెట్టుకున్నారు. అలా తన పాపులారిటీని పెంచుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ పదాలను టైటిల్స్ గా పెట్టుకుంటూ అభిమానుల పల్స్ ను విశ్వక్ ఈజీగా పట్టేస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక యూనిక్ బ్రాండ్ గా విశ్వక్ మారనున్నారు.
మరోవైపు, విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజైన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరోవైపు VS10లో కూడా నటిస్తున్నారు విశ్వక్‌సేన్. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. దీంతోపాటు అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గామి కూడా పూర్తి చేశారు విశ్వక్.