Begin typing your search above and press return to search.

తారక్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్! విశ్వక్ ఇచ్చిపడేశాడుగా..

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర పార్ట్-1 రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Sep 2024 6:38 AM GMT
తారక్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్! విశ్వక్ ఇచ్చిపడేశాడుగా..
X

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర పార్ట్-1 రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్స్ పోషించారు. బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న దేవర.. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇప్పటికే దేవర సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాంగ్స్ ఛార్ట్ బస్టర్లుగా నిలిచాయి. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్.. అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. తారక్ నట విశ్వరూపానికి అందరూ ఫిదా అయ్యారు. షార్క్ ఫైట్ సీక్వెన్స్ అయితే వేరే లెవల్ లో ఉందని చెప్పాలి. దీంతో దేవర మూవీపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

అయితే దేవర ట్రైలర్ అండ్ తారక్ లుక్స్ పై ఇద్దరు యూట్యూబర్లు రీసెంట్ గా నెగిటివ్ కామెంట్స్ చేశారు. నెగిటివ్ రివ్యూ కూడా ఇచ్చారు. ట్రైలర్ చూడ బుద్ది కాలేదని ఒక యూట్యూబర్ అన్నాడు. ట్రైలర్ ఇంపాక్ట్ పెద్దగా క్రియేట్ చేయలేదని మరొకొడు కామెంట్ చేశాడు. తనకు ట్రైలర్ నచ్చలేదని చెబుతూ.. ఎన్టీఆర్ లుక్స్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేశాడు. దీంతో యంగ్ హీరో విశ్వక్ సేన్.. వారిద్దరి రివ్యూలపై ఫుల్ సీరియస్ అయ్యారు.

నెగిటివ్ కామెంట్స్ అండ్ రివ్యూ ఇచ్చిన ఇద్దరు యూట్యూబర్లకు విశ్వక్ సేన్ ఇచ్చి పడేశారు. వేరే లెవల్ లో కౌంటర్ ఇచ్చారు. "ఫస్ట్ గోడకు సపోర్ట్ లేకుండా రెండు నిమిషాలు కూర్చో నువ్వు.. తర్వాత సినిమాను.. ఆడియన్స్ ను ఉద్దరిద్ధువు కానీ.. నాకు నిన్ను చూస్తే కాలుతుంది.. కానీ ఇప్పటికే కాలిపోయిన ఫేస్ నీది.. ఏం చేద్దాం.. నువ్వే మాట్లాడాలి అందం గురించి" అంటూ ఫైర్ అయ్యారు విశ్వక్. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ గా మారింది.

అయితే విశ్వక్ కు తారక్ అంటే చాలా ఇష్టం.. ఇప్పటికే అనేక సార్లు ఆ విషయాన్ని తెలిపారు. తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. అవకాశం దొరికినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ ను కలుస్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా కూడా తారక్ ను విశ్వక్ కలిశారు. అలా తన ఫేవరెట్ హీరో మూవీ ట్రైలర్ అండ్ లుక్స్ పై యూట్యూబర్లు నెగిటివ్ కామెంట్స్ చేయడంతో తీవ్రంగా మండిపడ్డారు.