విశ్వక్ 'లైలా'.. 'ఓహో రత్తమ్మ' సాంగ్ అదిరిపోయిందిగా!
గత ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు లైలా మూవీతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 31 Jan 2025 12:49 PM GMTటాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు లైలా మూవీతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది.
యంగ్ డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్ ఎమ్ టీ ప్రజెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కొత్త అందం ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.
సినిమాలో అబ్బాయి, అమ్మాయిగా రెండు రోల్స్ పోషించి తన వెర్సటాలిటీ చూపించనున్నారు విశ్వక్ సేన్. అయితే వాలెంటైన్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది లైలా మూవీ. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. వరుస అప్డేట్స్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.
మ్యూజిక్ ప్రమోషన్స్ లో ఒక్కో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మూడో పాటను రిలీజ్ చేశారు. ఓహో రత్తమ్మ.. నాగ రత్తమ్మ అంటూ సాగుతున్న ఆ పాటకు పెంచల్ లిరిక్స్ అందించారు. పాటను కూడా ఆలపించారు.
ఆయనతో కలిసి మధుప్రియ తన గాత్రాన్ని జోడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓహో రత్తమ్మ సాంగ్ వైరల్ గా మారింది. యూట్యూబ్ లో దూసుకుపోతోంది. పాట బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే సాంగ్ లో విశ్వక్ తన గ్రేస్ స్టెప్పులతో అలరించారు. స్టైలిష్ గా అండ్ మాస్ గా కనిపిస్తూ మెప్పిస్తున్నారు.
హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్నారు. హీట్ పుట్టించే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఓహో రత్తమ్మ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్సే వస్తోంది. అదే సమయంలో రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కోయ్ కోయ్ ను సాంగ్ కు బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేయడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి మీరు ఆ సాంగ్ ను విన్నారా?