Begin typing your search above and press return to search.

శివుడిగా విశ్వక్.. బాలయ్య డ్రాప్ అయితే..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 July 2024 3:33 AM GMT
శివుడిగా విశ్వక్.. బాలయ్య డ్రాప్ అయితే..
X

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. వరుస సినిమాలు లైన్ లో పెడుతూ మాస్ కా దాస్ దూసుకుపోతున్నారు. వైవిధ్యమైన కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్ ను అలరిస్తున్నారు. రకరకాల ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా మల్టీ టాలెంట్ తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

2024లో ఇప్పటికే గామితోపాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీపావళి కానుకగా మెకానిక్ రాకీ మూవీతో సందడి చేయనున్నారు. అయితే గామిలో అఘోర శంకర్ పాత్రలో విశ్వక్ నటించిన విషయం తెలిసిందే. ఎవరూ చేయడానికి సాహసించని రోల్ లో కనిపించి తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. మూవీ రిలీజ్ తర్వాత షూటింగ్ టైమ్ తో విశ్వక్ కష్టం తెలిసి అంతా హ్యాట్సాఫ్ చెప్పారు.

అయితే సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది. స్పెషల్ కాన్సెప్టులతో సినిమాలు తీస్తున్నారు మేకర్స్. కల్కి ఇటీవల వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కన్నప్ప సహా పలు చిత్రాలు డివోషనల్ జోనర్ లో తెరకెక్కుతున్నాయి. కన్నప్పలో శివుడి క్యారెక్టర్ అక్షయ్ కుమార్ చేస్తున్నట్లు టాక్. ఇక టాలీవుడ్ లో శివుడి పాత్ర చేయడానికి తాను రెడీ అంటున్నారు విశ్వక్ సేన్. బాలయ్య ఓకే చెప్పకపోతే, తాను చేస్తానని చెబుతున్నారు.

అందుకు ప్రత్యేక కారణాన్ని కూడా వివరిస్తున్నారు. గామి సినిమా కోసం కాశీలో 15 రోజులపాటు అఘోర గెటప్ లోనే తిరిగానని చెప్పారు విశ్వక్. ఆ సమయంలో తాను నిజంగా అఘోర అనుకుని భిక్ష కూడా వేసేశారని తెలిపారు. తనను ఎవరూ కూడా గుర్తుపట్టలేదని పేర్కొన్నారు. ఆ 15 రోజులు కూడా ఓ విధమైన ఎమోషనల్ జోన్ లో ఉన్నానని తెలిపారు. అప్పుడు ఆ మహాశివుడికి తనకు చిన్నపాటి కనెక్షన్ ఏర్పడిందని చెప్పారు విశ్వక్.

శివుడి పాత్రకు బాలయ్య బాగా సెట్ అవుతారని తెలిపారు విశ్వక్. ఆయన గానీ డ్రాప్ అయితే తాను నటించేస్తానని చెప్పారు. ఇక బాలయ్య.. కూడా అఖండలో అఘోరగా కనిపించారు. మూవీ సగభాగం ఆ రోల్ లోనే నటించారు. అప్పుడెప్పుడో జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామ కళ్యాణం సినిమాలో ఓ పాటలో బాలయ్య కాసేపు మహా శివుడి పాత్రలో కనిపించారు. మరి ఇప్పుడు విశ్వక్.. ఏదైనా సినిమాలో శివుడిగా కనిపిస్తారో లేదో చూడాలి.