Begin typing your search above and press return to search.

బాలయ్య లొల్లి .. విశ్వక్ సేన్ ఎంటర్ !

హీరో విశ్వక్ సేన్, దర్శకుడు కృష్ణ చైతన్యల లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది

By:  Tupaki Desk   |   30 May 2024 9:55 AM GMT
బాలయ్య లొల్లి .. విశ్వక్ సేన్ ఎంటర్ !
X

హీరో విశ్వక్ సేన్, దర్శకుడు కృష్ణ చైతన్యల లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే మరో నాయిక అంజలి ముఖ్య పాత్ర పోషించింది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చాడు . ఈ క్రమంలో స్టేజీ మీదకు వచ్చిన బాలయ్య హీరోయిన్ అంజలిని పక్కకు నెట్టాడు. బాలయ్య నెట్టిన విధానంతో పాటు, స్టేజీమీద మందు కలిపినట్లు ఉన్న ఓ బాటిల్ తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

బాలయ్య నెట్టివేయడంతో అంజలి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పక్కనే ఉన్న నేహా శెట్టి మరింత షాక్ అయింది. అయితే ఈ విషయాన్నీ నటి అంజలి సరదాగా తీసుకోని తరువాత నవ్వేస్తుంది. ఈ విషయం గురించి వివాదంపై పెద్దఎత్తున మీడియాలో వివాదం చెలరేగింది. బాలయ్య మహిళలకి గౌరవం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నటుడు విశ్వక్ సేన్ స్పందించాడు. ‘ఈవెంట్ లో జరిగింది వేరు .. సోషల్ మీడియాలో చూపిస్తున్నది వేరు. దానికి ముందు వెనుక కట్ చేసి వైరల్ చేస్తున్నారు. బాలయ్య ఎప్పుడు అందరితో సరదాగా వుంటారు.ఆయనపై ట్రోల్స్ ఆపండి’ అని విశ్వక్ అంటున్నాడు. ఈ ఘటన ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.