Begin typing your search above and press return to search.

ఇన్ స్టా గ్రామ్ కి విశ్వ‌క్ సేన్ డేట్లు ఇలా కేటాయించాడు!

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ఇటీవ‌లే ఇన్ స్టా గ్రామ్ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం నుంచి ఎగ్జిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 July 2024 3:44 AM GMT
ఇన్ స్టా గ్రామ్ కి విశ్వ‌క్ సేన్ డేట్లు ఇలా కేటాయించాడు!
X

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ఇటీవ‌లే ఇన్ స్టా గ్రామ్ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం నుంచి ఎగ్జిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అత‌డు స‌డెన్ గా సోష‌ల్ మీడియాలోకి దూర‌మ‌వ్వ‌డంతో ఏం జ‌రిగింది? అన్న చ‌ర్చ అభిమానుల్లో వాడి వేడిగా జ‌రిగింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఓ యూట్యూబ‌ర్ తోనూ నెట్టింట చ‌ర్చ‌కు దారితీయ‌డంతో ఆ కార‌ణంగానే విశ్వ‌క్ ఎగ్జిట్ అయ్యాడా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి.

అయితే తాజాగా తాను ఎగ్జిట్ అవ్వ‌డానికి గ‌ల కార‌ణాల్ని రివీల్ చేసాడు. సినిమా రిలీజ్ కి వారం ముందు రోజులు..రిలీజ్ త‌ర్వాత వారం రోజుల పాటే ఇన్ స్టాలో ఉంటాన‌ని మిగ‌తా స‌మ‌యంలో దానికి దూరంగా ఉంటాన‌న్నాడు. 30 ఏళ్లు వ‌చ్చాయి కాస్త ప‌నిమీద దృష్టి పెడ‌దాం అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకు న్నాను. ఫోన్ స‌మ‌యం గ‌డ‌ప‌డం కంటే ప‌నిపై దృష్టి పెట్టాలంటే? ఇలాంటి నిర్ణ‌యాలు త‌ప్ప‌వు.

కేవ‌లం అభిమానుల‌తో క‌నెక్ట్ అవ్వ‌డం కోసమే వాటిని వాడ‌తాను. అమ్మాయిల కోసం కాదు. అమ్మాయిల ఫాలోయింగ్ ఎవ‌రు కోరుకోరు. అలా ఉంటే మంచిదే క‌దా. నా గురించి అంతా మాట్లాడుకుంటే నాకు సంతోష‌మే` అన్నాడు. అలాగే ట్విట‌ర్ లో మాత్రం యాక్టివ్ గానే కొన‌సాగుతున్నాడు. దాన్ని త‌న సోష‌ల్ మీడియా టీమ్ చూసుకుంటుంది.

ఇక యంగ్ హీరో ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ఇప్ప‌టికే రెండు స‌క్సెస్ లు ఖాతాలో వేసుకున్నాడు. `గామీ`, `గాంగ్స్ ఆఫ్ గోదావ‌రి`చిత్రాలు విశ్వ‌క్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో `మెకానిక్ రాకీ` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు.