Begin typing your search above and press return to search.

విశ్వక్ కు ఆ బిగ్ ప్రాజెక్ట్ లో నటించాలనుందట!

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో అలరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 May 2024 9:48 AM GMT
విశ్వక్ కు ఆ బిగ్ ప్రాజెక్ట్ లో నటించాలనుందట!
X

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో అలరిస్తున్నారు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ అదరగొడుతున్నారు. 2024లో ఇప్పటికే గామి మూవీతో మంచి హిట్ అందుకున్నారు. అఘోర శంకర్ రోల్ లో ఒదిగిపోయారు విశ్వక్ సేన్.

ఇప్పుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో అలరించేందుకు సిద్దమవుతున్నారు. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే సూపర్ బజ్ ఉంది. మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ మూవీపై క్రమంగా అంచనాలు పెంచేస్తున్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కచ్చితంగా మూవీ చూడాలనిపించేలా ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేసింది.

ఇదంతా పక్కన పెడితే.. స్టార్ హీరో ఎన్టీఆర్ కు విశ్వక్ సేన్ బిగ్ ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. తారక్ సినిమా రిలీజ్ అయితే విశ్వక్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆ మధ్య ఎన్టీఆర్ ను విశ్వక్ కలిసిన పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ.. విశ్వక్ ను ఒకవేళ మీరు తారక్ సినిమాను రీమేక్ చేస్తే ఏది చేస్తారని అడగ్గా.. ఆయన వెంటనే నా అల్లుడు అని చెప్పారు.

ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో తారక్ అప్ కమింగ్ మూవీలో నటించాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టారు విశ్వక్. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న NTR 31 ప్రాజెక్ట్ లో అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని ఆయన చెప్పారు. అయితే తారక్, విశ్వక్ మధ్య ఉన్న పరిచయం.. మాస్ కా దాస్ కు ఛాన్స్ వచ్చేలా చేయడం చాలా ఈజీ. మరి విశ్వక్ కు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

అయితే NTR 31 మూవీ అనౌన్స్మెంట్ గత ఏడాది వచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. రీసెంట్ గా తారక్ బర్త్ డే సందర్భంగా.. ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నామని ప్రకటించారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్.. స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వినికిడి. మరోవైపు తారక్.. దేవర, వార్-2 షూటింగ్స్ ను పూర్తి చేసి NTR 31 సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.