Begin typing your search above and press return to search.

ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరో చెప్పాలా? బర్గర్ తినాలా? : విశ్వక్

వరుస సినిమాలతో సినీ ప్రియులను అలరిస్తున్నారు. మస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   20 May 2024 9:10 AM GMT
ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరో చెప్పాలా? బర్గర్ తినాలా? : విశ్వక్
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఈ టాలీవుడ్ యంగ్ హీరో రూటే వేరు. సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు. వరుస సినిమాలతో సినీ ప్రియులను అలరిస్తున్నారు. మస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. హీరోగానే కాకుండా రచయిత, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కూడా దూసుకెళ్తున్నారు.

ఇటీవల ప్రయోగాత్మక చిత్రం గామితో హిట్ అందుకున్నారు విశ్వక్ సేన్. ఏ హీరో కూడా చేయని అఘోర రోల్ లో కనిపించి అదరగొట్టారు. విమర్శకుల నుంచి ప్రశంసలు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస చిత్రాలు లైన్ లో పెడుతున్నారు. త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మే 31వ తేదీన ఈ సినిమా థియేటరల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ఛార్ట్ బస్టర్ గా నిలిచాయి. యువన్ శంకర్ రాజా అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇక గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కు అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. లంకలరత్నగా విశ్వక్ సేన్ యాక్టింగ్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేకర్స్ మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ లేటెస్ట్ ఇన్ స్టా పోస్ట్ వైరల్ గా మారింది. ఓ రెస్టారెంట్ లో ఉన్న పిక్ ను షేర్ చేసిన ఆయన.. ట్రైలర్ వెయ్యాలా? సాంగ్ వెయ్యాలా? ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరో చెప్పాలా? లేదా బర్గర్ తినాలా? అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు. ఇక విశ్వక్ పోస్ట్ తర్వాత ఈ సినిమా నుంచి మరో గ్లింప్స్ రిలీజ్ అవ్వనుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఓ సాంగ్ కూడా రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుందని చెబుతున్నారు.

మొత్తానికి విశ్వక్ సేన్.. తన సినిమాకు క్రేజీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. విశ్వక్ పోస్ట్ కు లైకులు కొడుతున్న ఫ్యాన్స్.. సినిమా కోసం వెయిటింగ్ అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఛల్ మోహన రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విశ్వక్ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. తెలుగమ్మాయి అంజలి ముఖ్య పాత్రలో కనిపించనుంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.