Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ కు విశ్వక్ మరో ఛాన్స్

విశ్వక్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ కృష్ణ చైతన్యకే మరోసారి అవకాశం ఇచ్చారు విశ్వక్.

By:  Tupaki Desk   |   16 July 2024 1:30 AM GMT
ఆ డైరెక్టర్ కు విశ్వక్ మరో ఛాన్స్
X

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు ఉన్న క్రేజే వేరు. మాస్ కా దాస్ గా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. వరుస చిత్రాలతో సినీ ప్రియులను ఓ రేంజ్ లో అలరిస్తున్నారు. వెళ్లిపోమాకే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన.. ఫలక్ నామా దాస్ మూవీతో హీరో కమ్ డైరెక్టర్ గా మంచి స్టార్ డమ్ అందుకున్నారు. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా క్రేజ్ దక్కించుకున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో గామి సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకున్నారు విశ్వక్ సేన్. ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ.. విడుదలై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఎవరూ చేయని అఘోర రోల్ లో విశ్వక్ నటించి.. తనదైన శైలిలో అలరించారు. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఛల్ మోహనరంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఆ సినిమాలో లంకలరత్నగా అదరగొట్టారు.

ప్రస్తుతం విశ్వక్ సేన్.. రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మెకానిక్ రాఖీ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా.. లైలా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఈ రెండు చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ పై ఉండగానే.. విశ్వక్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ కృష్ణ చైతన్యకే మరోసారి అవకాశం ఇచ్చారు విశ్వక్.

అయితే కృష్ణ చైతన్య తెరకెక్కించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు రాబట్టడమే కాదు.. విశ్వక్ కు ఉన్న మాస్ హీరో ఇమేజ్ ను మరింత పెంచింది. మాస్ కా దాస్ ట్యాగ్ కు సరైన న్యాయం జరిగేలా చేసింది. దీంతో కృష్ణ చైతన్యకు కల్ట్ డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది. అంతకుముందు ఆయన తీసిన రౌడీ ఫెలో కూడా కల్ట్ మూవీగా నిలిచింది. దీంతో ఆ కల్ట్ నెస్ విశ్వక్ కు బాగా నచ్చింది.

అందుకే మళ్లీ ఆయనతో వర్క్ చేయనున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అయ్యాక.. కృష్ణ చైతన్య విశ్వక్ కు స్టోరీ నెరేట్ చేశారు. కథ విన్న వెంటనే విశ్వక్ ఓకే చెప్పేశారు. చాలా ఇంట్రెస్ట్ కూడా చూపించారు. అలా ఇద్దరూ కలిసి మరోసారి సినిమా చేయనున్నారు. విశ్వక్ సేన్, కృష్ణ చైతన్య ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. పవర్ పేట అనే టైటిల్ ను ఫిక్స్ కూడా చేసినట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.