Begin typing your search above and press return to search.

GOG బాక్సాఫీస్.. విశ్వక్ మళ్ళీ అంతే స్పీడుగా..

మాస్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" శుక్రవారం గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Jun 2024 9:30 AM GMT
GOG బాక్సాఫీస్.. విశ్వక్ మళ్ళీ అంతే స్పీడుగా..
X

మాస్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" శుక్రవారం గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఆరంభాన్ని ఇచ్చింది. గ్రామీణ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సాగే ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఇక రివ్యూల తో సంబంధం లేకుండా సినిమా చాలా ఏరియాలలో మంచి హైప్ క్రియేట్ చేసింది. విశ్వక్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన సినిమాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిలిచింది.

ముందు నుంచే సినిమాకు పాజిటివ్ హైప్ దక్కింది. ప్రమోషన్స్ లో మేకర్స్ వంద శాతం విజయం సాధించారు. ఇక మొదటిరోజు 8.2 కోట్ల గ్రాస్ సాధించడం ద్వారా మంచి ఓపెనింగ్ ను అందుకుంది. తక్కువ బడ్జెట్ మూవీ అయినప్పటికీ, ఇదే సమయంలో విడుదలైన "గమ్ గమ్ గణేష్" మరియు "భజే వాయు వేగం" చిత్రాల కంటే మెరుగ్గా కలెక్షన్స్ అందుకోవడం విశేషం.


ఇక నైజాం ఏరియాలోనే సాలీడ్ కలెక్షన్స్ దక్కాయి. ఆ రూట్లో ఈ చిత్రం 1.10 కోట్ల షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది, ఇక సీడెడ్ లో 76 లక్షల షేర్ సాధించింది. మిగతా ప్రాంతాల్లో మొదటి రోజు కలెక్షన్లు పరవాలేదు అనే విధంగా వచ్చాయి. ఇక టీజర్లు, ట్రైలర్లు, పాటలతో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, సానుకూల ప్రచారంతో కూడా మంచి హైప్ సృష్టించింది.

అయితే రివ్యూల ఎలా ఉన్నా కూడా సినిమాలో విశ్వక్ నటనకు ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి. నేరేషన్ లో కొంత లూప్స్ ఉన్నాయని టాక్స్ వచ్చాయి. అయినప్పటికీ, సాయంత్రం షోలలో మంచి ఆక్యుపెన్సీ ఉండటం వల్ల మంచి నెంబర్లు నమోదయ్యాయి. ఇప్పటికే సినిమాపై పెట్టిన పెట్టుబడి లో 40 శాతం వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది..

మరోవైపు పోటీగా "గమ్ గమ్ గణేష్" మరియు "భజే వాయు వేగం" చిత్రాలు కూడా వచ్చాయి. అయితే వాటికి కూడా యావరేజ్ టాక్ రావడంతో, "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" కు మొదటి వీకెండ్‌లో మెరుగ్గా ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ చిత్రం సంతృప్తికరమైన ఆక్యుపెన్సీని నిలుపుకుంటే, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ ద్వారా మరోసారి అర్థమైన విషయం ఏమిటి అంటే, విశ్వక్ సేన్ ప్రతి సినిమాతో కూడా సాలిడ్ ఓపెనింగ్ అందుకుంటాడు అని అర్థమైంది. అతని ప్రతి సినిమా కూడా మొదటి వీకెండ్ లోనే విలైనంతవరకు పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగానే వెనక్కి తెస్తూ ఉంటాయి. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా చాలా తొందరగానే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి మొత్తంగా ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.