Begin typing your search above and press return to search.

ఈసారి మరో ప్రయోగంతో విశ్వక్!

యంగ్ హీరో విశ్వక్ సేన్.. 2024లో అప్పుడే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు

By:  Tupaki Desk   |   6 Jun 2024 2:18 PM GMT
ఈసారి మరో ప్రయోగంతో విశ్వక్!
X

యంగ్ హీరో విశ్వక్ సేన్.. 2024లో అప్పుడే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. మార్చిలో గామి మూవీతో.. ఇటీవల ఎన్నికలు అయ్యాక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో సందడి చేశారు. అయితే ఎవరూ చేయడానికి అంగీకరించిన రోల్ ను ఒప్పుకుని.. గామిలో అఘోర శంకర్ గా కనిపించారు. తన యాక్టింగ్ తో పెద్ద ఎత్తున సినీ ప్రియులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు టాలీవుడ్ మాస్ కా దాస్.

ఇక రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో లంకల రత్న పాత్రలో అదరగొట్టారు విశ్వక్. మాస్ యాక్షన్ తో వేరే లెవల్ లో నటించారు. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఈ మూవీలో ఫుల్ మాసీగా క‌నిపించారు. అదిరిపోయే ఎన‌ర్జీ తో ఎలాంటి క్యారెక్ట‌ర్‌నైనా హై ఇంటెన్స్‌ గా స్క్రీన్‌ పై ప్ర‌జెంట్ చేయ‌గ‌ల‌నని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. చెప్పాలంటే.. ఆ రోల్ లో ఆయనను త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేనంత‌గా క్యారెక్ట‌ర్‌ ను పూర్తిగా ఓన్ చేసుకున్నారు విశ్వక్ సేన్.

ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం విశ్వక్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెండు చిత్రాల షూటింగ్ ను ప్రారంభించారు. అందులో ఒకటి మెకానిక్ రాకీ కాగా.. మరొకటి లైలా. అయితే కెరీర్ లో తొలిసారి లైలా సినిమాలో లేడీ గెటప్ లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ కొన్ని నెలల క్రితం తెలిపారు. సినిమాలో సెకండాఫ్ లో లైలాగా సందడి చేయనున్నట్లు వెల్లడించారు.

ఇక మేకర్స్ కొన్ని నెలల క్రితం.. రిలీజ్ చేసిన లైలా టైటిల్ వీడియో మంచి రెస్పాన్స్ అందుకుంది. లేడీస్ వాడే అడ్డం, లిప్ స్టిక్, ఐ లైనర్, మేకప్ కిట్, ఫ్లవర్స్ వంటి వస్తువులను వాటిని చూపిస్తూ లైలా ప్రపంచాన్ని పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాకు రామ్ నారాయణ్.. దర్శకత్వం వహిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు తనిష్క్ బగ్ఛీ సంగీతం అందిస్తున్నారు.

మొత్తానికి ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరో ప్రయోగం చేస్తున్నారనే చెప్పాలి. రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేసిన హీరోల జాబితాలో విశ్వక్ కచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి రకరకాల జోనర్లలో చిత్రాలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. క్రమంగా ఇండస్ట్రీలో తన మార్కెట్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. మరి ఈ ప్రయోగంతో ఎలాంటి హిట్ అందుకుంటారో విశ్వక్!