Begin typing your search above and press return to search.

విశ్వక్ ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో..?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తన మాస్ స్టామినాతో అలరిస్తున్న విశ్వక్ సేన్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు

By:  Tupaki Desk   |   7 Jun 2024 12:46 PM GMT
విశ్వక్ ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో..?
X

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తన మాస్ స్టామినాతో అలరిస్తున్న విశ్వక్ సేన్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు. విశ్వక్ సేన్ సినిమా వస్తుంది అంటే కచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఉంటుంది అనిపించేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఈ ఇయర్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ రెండు సినిమాలతో మంచి ఫలితాన్ని అందుకున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఐతే మాత్రం విశ్వక్ లోని మాస్ యాంగిల్ మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించేలా చేసింది.

విశ్వక్ చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న కథలు ఆడియన్స్ ని మెప్పిస్తున్నా కానీ అతని ఖాతాలో ఇప్పటివరకు 100 కోట్ల సినిమా ఒక్కటి పడలేదు. తన తో సమానమైన ఇమేజ్ ఉన్న హీరోలు 100 కోట్ల క్లబ్ లో చేరిపోగా విశ్వక్ మాత్రం ఇంకా ఆ మార్క్ రీచ్ కాలేదు. విశ్వక్ 100 కోట్ల సినిమాగా ఏది అవుతుంది అని మాస్ కా దాస్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అలాంటి స్టఫ్ ఉన్న సినిమాగా వచ్చింది. వసూళ్ల పరంగా ఆ రేంజ్ ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం విశ్వక్ సేన్ మెకానిక్ విక్కీ, లైలా సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా విశ్వక్ సేన్ స్టామినా ప్రూవ్ చేసేలా తెరకెక్కుతున్నాయి. మరి ఈ సినిమాలతో అయినా విశ్వక్ 100 కోట్లు రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.

తన ప్రతి సినిమాతో సరికొత్త ప్రయోగాలు చేస్తూ వస్తున్న విశ్వక్ తనను అభిమానిస్తున్న ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ గా ఉంటాడు. ప్రస్తుతం యువ దర్శకులతో తన మాస్ స్టామినా చూపిస్తున్న విశ్వక్ సేన్ స్టార్ డైరెక్టర్స్ తో కూడా ఛాన్స్ అందుకునే రోజులు ముందున్నాయని చెప్పొచ్చు. హీరోగానే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా విశ్వక్ సేన్ చేస్తున్న ఈ అటెంప్ట్ తప్పకుండా ఏదో ఒకరోజు ఆయన్ను టాప్ లో నిలబెడుతుందని చెప్పొచ్చు. సినిమాల కమిట్మెంట్ లో తనకు తానే సాటి అనేలా చేస్తున్న విశ్వక్ సేన్ తన ప్రతి ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. రాబోతున్న సినిమాలు కూడా విశ్వక్ కెరీర్ ని మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేసేందుకు చూస్తున్నాడు.