Begin typing your search above and press return to search.

విశ్వక్.. మళ్ళీ స్పీడ్ పెంచాడు..

యంగ్ హీరో విశ్వక్ సేన్ డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ తన ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   21 July 2024 5:55 AM GMT
విశ్వక్.. మళ్ళీ స్పీడ్ పెంచాడు..
X

యంగ్ హీరో విశ్వక్ సేన్ డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ తన ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. యాక్టర్ గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇవ్వడంతో ప్రేక్షకులు కూడా విశ్వక్ సేన్ కి బాగానే కనెక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా గ్రేషేడ్స్ లో విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్ అయితే అందరికి నచ్చింది. కథలో కూడా మంచి ఇంటెన్షన్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమాని పూర్తి చేసే పనిలో విశ్వక్ సేన్ పడ్డాడు. రామ్ తాళ్ళూరి నిర్మాణంలో మెకానిక్ రాకీ సినిమా చేస్తున్నాడు. రవితేజ ముళ్ళపూడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మాస్ కథాంశంతోనే ఈ చిత్రం కూడా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

ఈ నెల 26న మెకానిక్ రాకీ సాంగ్ లేదా గ్లింప్స్ ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. అదే రోజు మీడియా మీట్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసారు. మెకానిక్ రాకీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉండటం ఈ సినిమాని బిజినెస్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అందులో భాగంగానే గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారని టాక్.

ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి విశ్వక్ సేన్ కి జోడీగా నటిస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ మరో కీలక పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. అయితే ఆమె పాత్ర ఏంటనేది పూర్తిగా రివీల్ చేయలేదు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ మూవీ కథాంశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. టైటిల్ చూస్తుంటే పక్కా మాస్ యాక్షన్ చిత్రంగానే కనిపిస్తోంది.

జులై 26న మీడియా మీట్ లో కథ గురించి చెప్పొచ్చని టాక్. ఇదిలా ఉండగానే రీసెంట్ గా విశ్వక్ సేన్ లైలా మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. రెగ్యులర్ షూట్ ఆగష్టు నుండి ఉండే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో మొదటిసారి విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో విశ్వక్ సేన్ మంచి స్పీడ్ మీద ఉన్నాడనే మాట వినిపిస్తోంది.