Begin typing your search above and press return to search.

విశ్వక్ మల్టీస్టారర్.. నిజమేనా?

పాత్ర పాత్రకు కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తారని విశ్వక్ పై బాలయ్య ప్రశంసలు కురిపించారు.

By:  Tupaki Desk   |   29 May 2024 5:54 AM GMT
విశ్వక్ మల్టీస్టారర్.. నిజమేనా?
X

'నేను, విశ్వక్ ఒక తల్లి కడుపులో పుట్టలేదు.. కానీ బయట చూస్తే ఎవరైనా మమ్మల్ని కవలలే అంటారు.. అతడు నా అన్న'.. అంటూ సీనియర్ హీరో బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ కామెంట్స్ బట్టి నటసింహం బాలయ్య, యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అర్థమవుతుంది. పాత్ర పాత్రకు కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తారని విశ్వక్ పై బాలయ్య ప్రశంసలు కురిపించారు.

విశ్వక్ సేన్ కొత్త మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్.. నిన్న రాత్రి ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. GOG మూవీ తప్పకుండా హిట్ అవుతుందని బాలయ్య తెలిపారు. డైరెక్టర్, నిర్మాత, క్యాస్టింగ్ అంతా అదిరిపోయిందంటూ బాలకృష్ణ ప్రశంసించారు. ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం విశ్వక్ లో ఉందని తెలిపారు.

అయితే కొన్ని రోజుల క్రితం బాలయ్య, విశ్వక్ కాంబోలో మూవీ ఫిక్స్ అయ్యి మళ్లీ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో తనకు ఇష్టమైన హీరో మూవీలో ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకున్నానని, ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తానని విశ్వక్ చెప్పారు. దీంతో విశ్వక్ మిస్ చేసుకున్నది బాబీ, బాలయ్య కాంబోలో వస్తున్న NBK 109 ఛాన్సేనని టాక్ వినిపించింది. ఇప్పుడు GOG ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత.. బాలయ్య, విశ్వక్ కాంబోలో మల్టీస్టారర్ విషయం మరోసారి చర్చల్లోకి వచ్చింది.

నిన్నటి ఈవెంట్ లో బాలయ్య తన స్పీచ్ చివర్లో విశ్వక్ సేన్ భుజంపై చేయి వేసి.. ఒక సర్ప్రైజ్ కాంబో ప్లాన్ చేశామని ప్రకటించారు. త్వరలోనే అనౌన్స్ చేస్తామని కూడా చెప్పారు. దీంతో అది బాలయ్య, విశ్వక్ మల్టీస్టారర్ కోసమేనని అంతా అంటున్నారు. ఆ క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమైందని కామెంట్లు పెడుతున్నారు. పవర్ ప్యాక్డ్ మల్టీస్టారర్ ఫిక్స్ అంటూ విశ్వక్, బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య NBK 109 ప్రాజెక్ట్ చేస్తుండగా ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో కలిసి మరో మూవీ చేయనున్నారు. మరోవైపు, విశ్వక్ సేన్ మాత్రం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మే 31వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో థియేటర్లలో సందడి చేయనున్నారు. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి హిట్ కొడతారో? బాలయ్య చెప్పిన సర్ప్రైజ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో? సెట్స్ పైకి ఎప్పుడెళ్తుందో వేచి చూడాలి.