Begin typing your search above and press return to search.

విశ్వక్ సీన్.. ఈసారి పవర్ఫుల్ పోలీస్

టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్.

By:  Tupaki Desk   |   6 Aug 2024 8:20 AM GMT
విశ్వక్ సీన్.. ఈసారి పవర్ఫుల్ పోలీస్
X

టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ హీరో ఏడాదికి రెండు సినిమాల చొప్పున మూవీస్ చేసుకుంటూ అందరికంటే స్పీడ్ గా వెళ్తున్నాడు. ఇప్పటికే యాక్టర్ గా ఎస్టాబ్లిష్ అవుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. అతని నుంచి వచ్చే సినిమాలని చూడటానికి ఆసక్తి చూపించే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.


ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇందులో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో విశ్వక్ సేన్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ కాకపోయిన బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అయితే అందుకుంది. ప్రస్తుతం రామ్ తాళ్ళూరి నిర్మాణంలో తెరకెక్కుతోన్న మెకానిక్ రాకీ సినిమాతో రావడానికి విశ్వక్ సేన్ సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రీసెంట్ గా టీజర్ వచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం మరో రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. లైలా అనే సినిమాని రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా VS13 మూవీకి సంబందించిన ప్రీలుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీధర్ గంటా దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోంది.

గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండబోతున్నట్లు పోస్టర్ బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ కనిపించబోతున్నారు. ఈ ప్రీలుక్ లో అతని క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా పేస్ రివీల్ చేయకుండా పోస్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించబోతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉందంట. గ్రామీణ ప్రాంతాలలో రాజకీయ, భూసంబంధ గొడవలు, ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉంటాయి. వాటిని ఈ కథలో చూపించబోతున్నట్లు పోస్టర్ బట్టి అర్ధమవుతోంది. వాటిని పోలీస్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ ఎలా నియంత్రించాడు అనేది ప్రధాన ఎలిమెంట్ గా ఉంటుందంట.