Begin typing your search above and press return to search.

GOG: బాలకృష్ణ గారు అలా మాట్లాడితే ఏడ్చేశాను - విశ్వక్ సేన్

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, "ముందుగా ఈ వేడుకకు వచ్చిన బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

By:  Tupaki Desk   |   28 May 2024 5:21 PM GMT
GOG: బాలకృష్ణ గారు అలా మాట్లాడితే ఏడ్చేశాను - విశ్వక్ సేన్
X

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన "గ్యాంగ్ ఆఫ్ గోదావరి" ఈ నెల 31న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి, దీనికి కారణం ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడమే. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుకను నేడు గ్రాండ్‌గా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, "ముందుగా ఈ వేడుకకు వచ్చిన బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాధారణంగా నేను ఏడవను. అయితే, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక లారీ మీద నుంచి కింద పడ్డాను. అప్పుడు మోకాళ్లకి చాలా దెబ్బ తగిలింది. దాదాపు రెండు సంవత్సరాలు బెడ్ రెస్ట్ అనుకున్నాను. హాస్పిటల్‌కి వెళ్లడం జరిగింది, కానీ దేవుడు దయ వల్ల ఏమి జరగలేదు.

ఇంతమంది బ్లెస్సింగ్, లవ్ వల్ల అనుకుంటా, నాకు ఏమి జరగలేదు. ఆ టైంలో నాకు చాలామంది ఏం జరిగిందని టెన్షన్ పడ్డారు. ఆ టైంలో నాకు బాలయ్య గారు ఫోన్ చేసి, 15 నిమిషాల పాటు నాకు దెబ్బ తగిలింది అని బాధపడ్డారు. ఆయన మాట్లాడుతుంటే నేను చాలా ఏడ్చాను, చాలా ఎమోషనల్ అయ్యాను. బాలయ్య బాబు గారి లో ఎప్పుడూ కూడా ఒక లౌడ్‌నెస్ ఉంటుంది, కానీ ఆయన కాల్ చేసి, చాలా ఫీల్ అయ్యారు. అప్పుడు నా కళ్లల్లో కొన్ని సంవత్సరాల తర్వాత నీళ్లు తిరిగాయి. లవ్ యూ సో మచ్ సార్. నా లైఫ్‌లో ఫ్యామిలీ తర్వాత అంతా ప్రేమగా మాట్లాడిన వాళ్లు మీరే. మీరు ఎంతో కేరింగ్ గా మాట్లాడారు," అంటూ విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యాడు.

"మేము ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ 'తెలుగోడి ఆత్మగౌరవం' అంటూ ఎన్టీఆర్ గారి బొమ్మను రిలీజ్ చేశాం. మళ్లీ ఏడాది తర్వాత అదే రోజు ఈవెంట్ జరుగుతూ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఐదేళ్ల క్రితం మార్చి 31వ తేదీన 'ఫలక్ నూమా దాస్' రిలీజ్ అయింది. ఆ సినిమా వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎంతో రిస్క్ తీసుకొని ఆ సినిమా చేశాను. దాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలామంది నా ఆటిట్యూడ్ గురించి చాలా రకాలుగా కామెంట్ చేశారు, మార్చుకోవాలి అని, ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేవు అని అన్నారు. కానీ నా క్యారెక్టర్ మాత్రం ఎప్పుడూ మార్చుకోలేదు. ఆ క్యారెక్టర్ చూసే నన్ను మీరు అభిమానించారు. ఎలా ఉన్నా కూడా మనతో ఉండాలి అని చాలా మంది డిసైడ్ అయ్యారు.

ఇక ఐదు సంవత్సరాల పాటు ఎంతో మంది నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఫ్యాన్స్ కి చాలా థాంక్స్ చెప్పాలి. ఇప్పుడు చెబుతున్నాను, నెక్స్ట్ ఐదు సంవత్సరాలు వేరేగా ఉంటుంది. కాల్చిపడేస్తాను మొత్తం. మా డైరెక్టర్ గురించి ఎక్కువగా పొగడటం నాకు ఇష్టం ఉండదు. ఒక విధంగా ఇది నా డ్రీమ్ రోల్ అని చెప్పవచ్చు. ఎన్నో రకాల కథలు విన్నాను కానీ ఇలాంటి కథ దొరకలేదు. ఇది కత్తిలాంటి కథ. అతను వచ్చి కథ చెప్పగానే, నిర్మాతకు చెప్పాను, "దింపేస్తున్నాం" అని. ఇది ఒక డిఫరెంట్ కమర్షియల్ సినిమా. చాలా కొత్తగా ఉంటుంది. బాలకృష్ణ గారు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు, "న్యూ బాటిల్, ఓల్డ్ వైన్" అంటూ. ఆయన చెప్పారు. నాకు అది బాగా నచ్చింది.

నిర్మాత నాగ వంశీ గారికి చాలా థ్యాంక్స్. నేను పనిచేసిన తొమ్మిది బ్యానర్లలో ఇదే బెస్ట్ బ్యానర్. బెస్ట్ ప్రొడ్యూసర్. ఈ సినిమాలో చాలా గ్యాంగ్స్ ఉన్నాయి, కానీ గుర్తుపెట్టుకోవాల్సిన గ్యాంగ్ నాదే," అంటూ నటీనటులను చూపించారు. "రత్న అనే క్యారెక్టర్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. గుర్తుగా చెవికి ఒక కమ్మ కూడా కుట్టించుకున్నాను. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నిజాయితీగా వర్క్ చేశాము.

తప్పకుండా మే 31వ రోజు థియేటర్ కి ఫ్యామిలీ మొత్తం రావచ్చు. U/A సెన్సార్ వచ్చింది కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. వైలెన్స్ కూడా ఇందులో ఒక కారణంతో ఉంటుంది. తప్పకుండా రత్నా అనే వాడు ఏడిపిస్తాడు, నవ్విస్తాడు. కానీ లాస్ట్ కు సినిమా ముగిసిన తర్వాత మీతో పాటు మీ ఇంటికి వస్తాడు. చూసిన రెండు మూడు రోజుల వరకు కూడా ఆ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా గారు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.

అలాగే హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. ఆమె తప్పితే ఆ పాత్ర ఎవరు చేయలేరు. మొదట చైతన్య కథ చెప్పగానే ఆ పాత్రకు అంజలి గారే పర్ఫెక్ట్ సెట్ అవుతారు అని అనిపించింది. ఆమెతో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ఇందులో నేహా శెట్టి బుజ్జి అనే క్యారెక్టర్ చేసింది. రాధికా క్యారెక్టర్ ని మర్చిపోయి అందరూ కూడా బుజ్జి అనే క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకుంటారు. అంతలా ఆమె మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే నన్ను భరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నాను," ఇక చివరగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైలాగ్స్ చెప్పిన విశ్వక్ సేన్, ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించారు.