Begin typing your search above and press return to search.

విశ్వంభర బడ్జెట్.. మళ్ళీ పెరిగిందా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ విశ్వంభర. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది

By:  Tupaki Desk   |   4 March 2024 12:30 PM GMT
విశ్వంభర బడ్జెట్.. మళ్ళీ పెరిగిందా?
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ విశ్వంభర. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ తారాగణం ఈ మూవీలో కనిపించబోతున్నారు. మెగాస్టార్ ఇమేజ్, మార్కెట్, కంటెంట్ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ నుంచి 120 నుంచి 130 కోట్లలో పూర్తి చేయాలని అనుకున్నారు.

అయితే షూటింగ్ ఆరంభంలోనే బడ్జెట్ లెక్కలు మారిపోయినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ పెట్టుబడితో పాటు ఆర్టిస్ట్స్ లకి ఇచ్చే రెమ్యునరేషన్ తో కలుపుకొని మూవీ బడ్జెట్ 200 కోట్ల వరకు అయ్యేలా ఉందనే మాట వినిపిస్తోంది. 200 కోట్లు అంటే మెగాస్టార్ మార్కెట్ కంటే ఎక్కువ. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ చేస్తోన్న కూడా కంటెంట్ మీద నమ్మకంతో డేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష కృష్ణన్ నటిస్తోంది. చిరంజీవి సిస్టర్స్ పాత్రలలో ఆషికా రంగనాథ్, ఈషా చావ్లా, సురభి కనిపించనున్నారంట. అలాగే మృణాల్ ఠాకూర్, రాజ్ తరుణ్, నవీన్ చంద్ర స్పెషల్ రోల్స్ ఈ మూవీలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి దేవకన్యగా కనిపించనుందని టాక్. ఇలా స్టార్ క్యాస్టింగ్ ని మూవీలో కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు.

దీంతో బడ్జెట్ లెక్కలు అన్ని మారిపోయినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ మాత్రం 200 కోట్ల బడ్జెట్ అయిన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. మూవీ అవుట్ ఫుట్ బాగా వస్తే ఆటోమేటిక్ గా సినిమాకి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వెనక్కి వచ్చేస్తుందని వారు బిలీవ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మైథలాజికల్ టచ్ తో వచ్చే కమర్షియల్ సినిమాలకి దేశ వ్యాప్తంగా పెద్ద పీట వేస్తున్నారు.

విశ్వంభర మూవీ సోషియో ఫాంటసీ కథాంశంతో ఉండబోతోంది. మైథలాజికల్ టచ్ ని పవర్ఫుల్ గా వశిష్ఠ మల్లిడి ఈ సినిమాకి అందిస్తున్నాడు. అందుకే విశ్వంభర సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పుడే బడ్జెట్ 200 కోట్ల లెక్కలు కనిపిస్తున్నాయి అంటే పూర్తయ్యేనాటికి మరింత పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే మాట వినిపిస్తోంది.