Begin typing your search above and press return to search.

హిందీలో 'విశ్వంభర'కి భారీ రేటు.. ఎంతో తెలుసా!

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ విశ్వంభర సినిమాను రూ.38 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   21 Feb 2025 11:30 PM
హిందీలో విశ్వంభరకి భారీ రేటు.. ఎంతో తెలుసా!
X

బాహుబలి, కేజీఎఫ్‌, సలార్‌, పుష్ప సినిమాలతో పాటు మరికొన్ని సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా పుష్ప 2, బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద హిందీ సినిమాలను మించి వసూళ్లు రాబట్టాయి. పుష్ప 2 హిందీ వర్షన్‌ రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. అందుకే సౌత్ సినిమాల విషయంలో బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్‌ బాగుంటే సౌత్‌లో కంటే నార్త్‌ లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలు ఉన్నాయి. అందుకే మెగాస్టార్‌ విశ్వంభర సినిమాను హిందీలో భారీ రేటుకు కొనుగోలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాకి హిందీ డబ్బింగ్‌ రైట్స్ రూపంలో భారీ బిజినెస్ జరిగింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ విశ్వంభర సినిమాను రూ.38 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రూ.50 కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో అంత భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవికి సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్‌ ఇండియాలోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన సోషియో ఫాంటసీ సినిమా అంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మినిమం కంటెంట్‌ ఉంటుంది.

బింబిసార సినిమాతో వశిష్ట కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్నాడు. అందుకే ఈ సినిమా సైతం ఆయన అన్ని వర్గాల వారిని అలరించే విధంగా రూపొందిస్తాడనే నమ్మకం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు భారీ ఎత్తున బిజినెస్‌కి అవకాశాలు ఉన్నాయి. సినిమాను విజువల్‌ వండర్‌గా రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైన తర్వాత అంచనాలు పెరిగాయి. కొందరు విమర్శలు చేసినా ఎక్కువ శాతం మంది కంటెంట్‌ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు.

సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ విషయంలో రాజీ పడటం లేదు. అందుకే సినిమా విడుదల వాయిదా వేశారు. అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ టీం ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసిన వీఎఫ్‌ఎక్స్ ఎక్స్‌పర్ట్స్ ఈ సినిమాకు గాను వర్క్‌ చేస్తున్నారని సమాచారం అందుతోంది. సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ కోసం ప్రత్యేకంగా షూట్‌ చేశారు. వాటికి సంబంధించిన వర్క్‌ గత కొన్ని నెలలుగా జరుగుతుంది. మే నెలలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఆలస్యం అవుతున్న కారణంగా మే నెలలోనూ సినిమా విడుదల అయ్యేనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు విశ్వంభర సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో రిలీజ్ డేట్‌పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.