మెగా విశ్వంభర శాంపిల్ చూపిస్తారా..?
సినిమా మొదలైనప్పుడే ఒక గ్లింప్స్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు డైరెక్టర్.
By: Tupaki Desk | 10 Jan 2025 9:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ వశిష్టతో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150 నుంచి చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నాడు ఐతే వాల్తేరు వీరయ్య హిట్ పడినా గాడ్ ఫాదర్, భోళా శంకర్ లు ఫ్లాప్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్లాన్ మార్చి కొత్త అటెంప్ట్ చేస్తున్నారు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ట మెగా విశ్వంభర సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా మొదలైనప్పుడే ఒక గ్లింప్స్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు డైరెక్టర్.
ఇక సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా అసలైతే అనుకున్న ప్రకారం జరిగితే నేడు ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ రాం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఆ సినిమాను వాయిదా వేశారు. ఇక మెగా విశ్వంభర సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఉండగా సంక్రాంతి కానుకగా ఒక టీజర్ రిలీజ్ ప్లానింగ్ ఉందని తెలుస్తుంది.
సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కి కానుకగా ఆల్రెడీ రాం చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజైంది. ఐతే ఇది చాలదు అన్నట్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ టీజర్ ని దించుతున్నారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టీజర్ కూడా వస్తుందని అంటున్నారు. సినిమా నుంచి వచ్చే టీజరే ప్రాజెక్ట్ పై ఇంపాక్ట్ కలిగేలా చేస్తుంది. విశ్వంభర టీజర్ విషయంలో కూడా వశిష్ట చాలా కేర్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఈ టీజర్ శాంపిలే మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అందిస్తుందని అంటున్నారు.
చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలోనే విశ్వంభర సినిమా కూడా విజువల్ గ్రాండియర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తుంది. సో చిరు విశ్వంభర విజువల్ ఫీస్ట్ మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ఫ్యాన్స్ అందరికీ సూపర్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. జనవరి రిలీజ్ మిస్సైనా టీజర్ తో మెగా ఫ్యాన్స్ సంతృప్తి పడనున్నారు. ఐతే ఈ టీజర్ అయినా వస్తుందా లేదా జస్ట్ ఇదంతా గాలి వార్తలేనా అన్నది కూడా తెలియాల్సి ఉంది.