Begin typing your search above and press return to search.

మెగా మామ అల్లుడు.. ఐటెం సాంగ్‌లు ఎప్పుడో?

విశ్వంభర సినిమా షూటింగ్‌ ఇప్పటికే ముగించాల్సి ఉంది. కానీ చిరంజీవి చికెన్ గున్యా తో బాధపడుతున్న కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది.

By:  Tupaki Desk   |   28 Sep 2024 3:30 PM GMT
మెగా మామ అల్లుడు.. ఐటెం సాంగ్‌లు ఎప్పుడో?
X

మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా ఒకటి కాగా, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2 ఒకటి. ఈ రెండు సినిమాల్లో పుష్ప 2 సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా ను 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమాల షూటింగ్స్ దాదాపు పూర్తి అయ్యాయి. ప్యాచ్ వర్క్ తో పాటు ఐటెం సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ అనే వార్తలు వస్తున్నాయి.

విశ్వంభర సినిమా షూటింగ్‌ ఇప్పటికే ముగించాల్సి ఉంది. కానీ చిరంజీవి చికెన్ గున్యా తో బాధపడుతున్న కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఇటీవలే ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో తిరిగి షూటింగ్‌ కి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఐఫా అవార్డు వేడుక కోసం దుబాయ్‌ వెళ్లిన చిరంజీవి వచ్చిన తర్వాత పాట చిత్రీకరణ ఉంటుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే చిరు విశ్వంభర ఐటం సాంగ్ కోసం సెట్‌ ను సిద్ధం చేశారు. అక్టోబర్‌ చివరి వరకు సినిమా మొత్తం షూటింగ్‌ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టాలని దర్శకుడు వశిష్ట తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరో వైపు అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2' సినిమా ఐటెం సాంగ్‌ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ పుష్ప 2 లో ఐటెం సాంగ్‌ లో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. పలువురు హీరోయిన్స్ పేర్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు పుష్ప 2 ఐటెం సాంగ్‌ హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. షూటింగ్‌ ప్రారంభం అయితే ఏమైనా ఆ విషయంపై స్పష్టత వస్తుందేమో చూడాలి. పుష్ప 2 సినిమా షూటింగ్‌ సైతం అక్టోబర్‌ లో పూర్తి చేయాలని దర్శకుడు సుకుమార్ చాలా పట్టుదలతో ఉన్నారు.

విశ్వంభర సినిమాకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఎక్కువ ఉందట. అందుకే ముందే షూటింగ్‌ పూర్తి చేయాలని భావించినా అది సాధ్యం కాలేదు. ఇప్పటికే వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ షురూ అయింది. త్వరలోనే ఆ పాట చిత్రీకరణ ముగించి సినిమా విడుదలకు ఉన్న ఇబ్బందులను తొలగించాలని దర్శకుడు వశిష్ట భావిస్తున్నాడట. డిసెంబర్‌ లో పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కనుక వాటికి గట్టి పోటీ ఇవ్వాలంటే ఐటెం సాంగ్ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అందుకే పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కోసం చాలా చర్చలు జరుగుతున్నాయని మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. మొత్తానికి అక్టోబర్ మొదటి వారంలో ఈ రెండు సినిమాల ఐటెం సాంగ్స్‌ ను ముగించే అవకాశాలు ఉన్నాయి.