Begin typing your search above and press return to search.

విశ్వంభర 'రామ రామ సాంగ్': భక్తితో మెగా పాజిటివ్ వైబ్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "విశ్వంభర" సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   12 April 2025 6:10 AM
విశ్వంభర రామ రామ సాంగ్: భక్తితో మెగా పాజిటివ్ వైబ్స్
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "విశ్వంభర" సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తరువాత చిరంజీవి ఓ విజువల్ స్పెటికల్ ఫాంటసీ డ్రామాలో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక రేంజ్ లో క్రేజ్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో సీనియర్ హీరోల సినిమాల్లో ఓ రికార్డే సృష్టించింది.

ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా "విశ్వంభర" నుంచి ఫస్ట్ సింగిల్ “రామ రామ” అనే పాటను విడుదల చేశారు. ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాట మొదటిసారి విన్న వెంటనే హార్ట్ ని టచ్ చేసే విధంగా ఉంది. ఓ భక్తి తత్త్వాన్ని ఆధ్యాత్మికంగా పలికించే ఈ పాటకు ఓ ప్రత్యేకమైన మ్యాజిక్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఒకసారి విన్నాక అది మైండ్ లో అలా మిగిలిపోతుంది.

పాటను చూస్తే చిరంజీవి మ్యాజిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌ ఎలా ఉంటుందో మరోసారి తెలుస్తుంది. సింపుల్ స్టెప్పులు, నిబద్ధతతో కూడిన భావప్రకటన, భారీ సెట్స్ మధ్య ఆయన ఆ పవిత్రతను వ్యక్తీకరించిన తీరు పాటకు మరింత గొప్పతనాన్ని తీసుకువచ్చింది. చిరు అంత భక్తితో కనిపించడంతో పాటే కాదు అతడిపై ప్రేమ కూడా రెట్టింపైంది.

శంకర్ మహాదేవన్ ఆలాపనలో ఈ పాట భక్తిరసంతో పరవశింపజేస్తుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు సులభంగా గుర్తుండేలా, వినసొంపుగా ఉండేలా ఉన్నాయి. గానం చేయదగినలా ఉండేలా రాశారు. మొత్తం పాటను విన్నాక అది మన హృదయాన్ని తాకి ఓ భక్తి ప్రయాణంలోకి తీసుకువెళుతుంది.

దర్శకుడు వశిష్ఠ మల్లిడి ‘మెగా మాస్ బియాండ్ యూనివర్స్’ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. UV క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నెవ్వర్ బిఫోర్ అనే స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమా గ్లింప్స్, ఇప్పుడు “రామ రామ” పాట ద్వారా ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఈ పాట విడుదలతో సినిమాపై హైప్ ఇంకాస్త పెరిగింది. సంగీతం, విజువల్స్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ లను అందుకుంటుందో చూడాలి.