Begin typing your search above and press return to search.

సంక్రాంతి మిస్.. మరో ఫెస్టివల్ టార్గెట్ తో విశ్వంభర..?

అందుకే ఈసారి కొత్తగా ఏదైనా ప్రయోగం చేయాలని వశిష్టతో విశ్వంభర చేస్తున్నాడు చిరంజీవి.

By:  Tupaki Desk   |   23 Dec 2024 1:30 PM GMT
సంక్రాంతి మిస్.. మరో ఫెస్టివల్ టార్గెట్ తో విశ్వంభర..?
X

మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150తో చిరు రీ ఎంట్రీ ఇవ్వగా అప్పటి నుంచి రొటీన్ కథలు చేస్తున్నాడు అన్న టాక్ ఉంది. అందుకే ఈసారి కొత్తగా ఏదైనా ప్రయోగం చేయాలని వశిష్టతో విశ్వంభర చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాను చిరు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరితో పోల్చుకుంటున్నారు.

విశ్వంభర సినిమా గ్లింప్స్ తోనే సినిమాపై ఒక బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు వశిష్ట. ఐతే ఈ సినిమా అసలైతే 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాకపోతే ఆ టైం కు చరణ్ గేమ్ ఛేంజర్ వస్తుండటం వల్ల సినిమా వాయిదా వేశారు. అంతేకాదు సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా పూర్తి కాలేదనే వాయిదా వేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. విశ్వంభర నెక్స్ట్ సమ్మర్ కి వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఐతే లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం చిరు విశ్వంభర సమ్మర్ కి కూడా రావడం కన్ఫర్మ్ కాదట. సినిమాను ఫెస్టివల్ కే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒక ఫెస్టివల్ అదే సంక్రాంతికి మిస్ అవుతుంది కాబట్టి మరో ఫెస్టివల్ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. దసరాకి ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఫిక్స్ అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి దసరాకి డబుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.

బింబిసార సినిమాతో తొలి సినిమానే తన టాలెంట్ చూపించిన వశిష్ట రెండో సినిమాను ఏకంగా చిరంజీవితో చేస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ లు కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. అకాడమీ అవార్డ్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చిరు విశ్వంభర భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపిస్తారా లేదా అన్నది చూడాలి.

భోళా శంకర్ పోవడంతో విశ్వంభరతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నారు చిరంజీవి. అందుకే సినిమాను ఎలాంటి హడావిడి లేకుండా ష్యూర్ షాట్ హిట్ గా ఉండాలని చూస్తున్నారు. కొత్త కథతో చిరంజీవి నుంచి వస్తున్న క్రేజీ మూవీ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ కూడా విశ్వంభర సినిమా కోసం సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.