'విశ్వంభర' రిలీజ్ తేదీ వాళ్ల చేతుల్లోనే ఉందా?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 'విశ్వంభర' రిలీజ్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Feb 2025 8:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 'విశ్వంభర' రిలీజ్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా అనివార్య కారణలతో వాయిదా పడింది. అప్పటి నుంచి రిలీజ్ తేదీపై సరైన స్పష్టత రాలేదు. మార్చి లేదా? ఏప్రిల్ , మేలో రిలీజ్ అవుతుందనే కొత్త ప్రచారం షురూ అయింది. అయితే మేకర్స్ ఈ ప్రచారంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇప్పటికే వాయిదా పడిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్ కి షురూ అవుతుందని అంతా నమ్ము తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఇంకా వాయిదాల పర్వం కొనసాగేలా కనిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ తేదీపై స్పష్టత రావాలంటే డిజిటల్ బిజినెస్ క్లోజ్ అయితే గానీ రాదని తాజా సమాచారం. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జీ స్టూడియోస్ తో జరుగుతున్నాయట.
ఆ డీల్ ఎప్పుడు పూర్తవుతుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అది ఇంకా చర్చల దశలో ఉంది. డీల్ క్లోజ్ అయితే జీ స్టూడియోస్ సూచించిన స్ట్రీమింగ్ స్లాట్ ప్రకారం మేకర్స్ రిలీజ్ తేదీ ప్రకటించాలని చూస్తున్నారట. దీనిపై మార్చిలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే మార్చిలో రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో జులైలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావాల్సి ఉందట. 'విశ్వంభర' సోషియా ఫాంటసీ చిత్రం కావడంతో సీజీ వర్క్ అధికంగానే ఉంది. సీజీ కోసం నెలల తరబడి పనిచేస్తున్నారు. అవసరం మేర విదేశాల్లో కూడా కొంత సీజీ వర్క్ జరుగుతుంది. అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకుని మేకర్స్ ముందుకెళ్తున్నారు. థియేట్రికల్ గా సినిమాకి పెద్ద ఎత్తున బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.