విశ్వంభర ఇప్పట్లో వచ్చేలా లేడుగా!
సోషియో ఫాంటసీ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తారని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి.
By: Tupaki Desk | 13 Feb 2025 5:10 AM GMTఎంతో నమ్మకంగా చేసిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ అవడంతో ఆ తర్వాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు, గ్యాప్ తీసుకుని మరీ మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. విశ్వంభర అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
వాస్తవానికి ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ పూర్తి అవకపోవడం, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు కోరడంతో చిరూ తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఆ తర్వాత విశ్వంభరను సమ్మర్ కానుకగా రిలీజ్ చేద్దామనుకున్నారు.
సోషియో ఫాంటసీ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తారని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే విశ్వంభర రిలీజ్ ఇంకా లేటవుతుందని అంటున్నారు. సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా ఆలస్యంగా జరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
వీఎఫ్ఎక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో డైరెక్టర్ వశిష్ట చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తను ఆశించిన అవుట్‌పుట్ వచ్చేవరకు కాంప్రమైజ్ అవడం లేదట. టీజర్ విషయంలో వచ్చిన నెగిటివిటీని దృష్టిలో పెట్టుకునే వశిష్ట ఇంత జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే విశ్వంభర మరింత ఆలస్యమవడం ఖాయమని అర్థమవుతుంది.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. విశ్వంభరకు కీరవాణి ఇచ్చిన పాటలు విని ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ట ఎలివేషన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చిరంజీవి విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గానే ఈ సినిమాను చిరూ సభా ముఖంగా అనౌన్స్ చేశాడు.