మ్యూజిక్ సిట్టింగ్స్ లో విశ్వంభర
సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ను డైరెక్టర్ వశిష్ట నెట్టింట షేర్ చేశాడు.
By: Tupaki Desk | 28 Jan 2025 8:17 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా సినిమా విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ను డైరెక్టర్ వశిష్ట నెట్టింట షేర్ చేశాడు.
విశ్వంభరకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలియచేస్తూ చంద్రబోస్, కీరవాణి, చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. విశ్వంభరకు మంచి సంగీతాన్ని అందించినందుకు కీరవాణికి థ్యాంక్స్ చెప్తూ, ఆడియన్స్ ఈ సాంగ్స్ చూసి ఎంతో ఆనందిస్తారని, సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపాడు.
విశ్వంభర కోసం కీరవాణి స్పెషల్ కేర్ తీసుకుని మరీ మ్యూజిక్ ను కంపోజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ కు అధిక ప్రాధాన్యం కలిగిన ఈ సినిమాకు దానికి తగ్గ బీజీఎం ఇవ్వాలని కీరవాణి ప్రయత్నిస్తున్నాడని, సినిమా రిలీజ్ తర్వాత విశ్వంభర హైలైట్స్ లో కీరవాణి సంగీతం కూడా ఒక హైలైట్ గా నిలవనుందని సమాచారం.
భోళా శంకర్ డిజాస్టర్ అవడంతో మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, ఈషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా ప్రకటించ లేదు.
వాస్తవానికి విశ్వంభర సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ లేటవడం, వీఎఫ్ఎక్స్ వర్క్స్, ఇతర కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే విశ్వంభర రిలీజ్ కోసం మే 9వ తేదీని మేకర్స్ ఫిక్స్ చేస్తున్నారని సమాచారం. గతంలో ఇదే రోజున చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజైన విషయం తెలిసిందే.