వీరమల్లు మీద కన్నేసిన విశ్వంభర?
ఇప్పుడు మెగాస్టార్ సైతం అదే డేట్ మీద కన్నేస్తున్నారని అంటున్నారు. కాకపోతే ఇప్పటికే మరో మూడు క్రేజీ మూవీస్ ఆ తేదీ మీద కర్చీఫ్స్ వేసుకొని కూర్చున్నాయి.
By: Tupaki Desk | 10 Oct 2024 3:30 PM GMT2025 సంక్రాంతి సినిమాల మీద గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. క్రిస్మస్ కు విడుదల చేయాలని అనుకున్న 'గేమ్ ఛేంజర్' మూవీని పొంగల్ కు తీసుకొచ్చే అవకాశం ఉందని వస్తున్నాయి. దీనికి కారణం జనవరి 10వ తేదీన రావాల్సిన 'విశ్వంభర' చిత్రం రేసు నుంచి తప్పుకోవడమే అనే మాట వినిపిస్తోంది. డిజిటల్ రైట్స్ ఒప్పందాల కారణంగా చిరంజీవి సినిమా వాయిదా పడనుందని, వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఓటీటీ సంస్థ కండిషన్ పెడుతోందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో 'విశ్వంభర' కోసం మార్చి 28 స్లాట్ ను పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది.
మార్చి 28 అనేది చాలా మంచి డేట్. ఎందుకంటే 30న ఉగాది, 31వ తేదీ సోమవారం ఈద్ పండగలు ఉన్నాయి. అదనంగా ఒకరోజు హాలిడే కలిసొస్తుంది కాబట్టి, లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే సహజంగానే మార్చి 28 కోసం టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు మెగాస్టార్ సైతం అదే డేట్ మీద కన్నేస్తున్నారని అంటున్నారు. కాకపోతే ఇప్పటికే మరో మూడు క్రేజీ మూవీస్ ఆ తేదీ మీద కర్చీఫ్స్ వేసుకొని కూర్చున్నాయి.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'VD 12' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను వచ్చే ఏడాది మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రాన్ని మార్చి 27న విడుదల చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇంతలోనే 'హరి హర వీరమల్లు' పార్ట్-1ను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అఫిషియల్ అనౌన్స్ చేసారు.
సితార నిర్మాతలతో పవన్ కళ్యాణ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి, వీరి మధ్య క్లాష్ ఉండకపోవచ్చు. 'హరి హర వీరమల్లు' కోసం విజయ్ దేవరకొండ సినిమాని వాయిదా వేసుకునే అవకాశం లేకపోలేదు. కాకపోతే ఇప్పుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రాన్ని అదే రోజున విడుదల చెయ్యాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే చిరు - పవన్ ల సినిమా ఒకే తేదీకి వచ్చే ఛాన్స్ లేదు. సో మెగా బ్రదర్స్ లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి.
ఇక్కడ మరో సమస్య ఏంటంటే, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సికిందర్' సినిమా మార్చి నెలాఖరునే విడుదల కానుంది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంటిమెంట్ గా వచ్చే ఈద్ కు తీసుకొస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి 'హరి హర వీరమల్లు' 'VD 12' 'విశ్వంభర' సినిమాల్లో ఏది వచ్చినా సరే.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద 'సికిందర్' మూవీతో పోటీ పడాల్సి ఉంటుంది. అది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. మరి ఇవన్నీ అలోచించి 'మార్చి 28' స్లాట్‌ను ఫైనల్ గా ఎవరు లాక్ చేసుకుంటారో చూడాలి.