చిరు vs రవితేజ.. ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడదుగా..?
ఇప్పుడు అలాంటి చర్చకు కారణం అయిన రెండు సినిమాలు.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, మాస్ మహారాజా రవి తేజ నటిస్తున్న మాస్ జాతర.
By: Tupaki Desk | 12 April 2025 5:20 AMతెలుగు సినిమాల్లో రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం కొత్తేమీ కాదు. ఒకదానికి డేట్ ఫిక్స్ చేయడం, మరోదాన్ని వాయిదా వేయడం, అప్పటికే ఫిక్స్ అయిన సినిమాల ప్లాన్లను కదిలించడం... ఇలా ఏ సినిమాకైనా డేట్ అనేది ఒక వ్యూహాత్మక మార్గంగా మారిపోయింది. ఇప్పుడు అలాంటి చర్చకు కారణం అయిన రెండు సినిమాలు.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, మాస్ మహారాజా రవి తేజ నటిస్తున్న మాస్ జాతర.
లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం విశ్వంభర జూలై 24న థియేటర్లకు రానుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడం మెగా ఫ్యాన్స్‌ను కాస్త కన్ఫ్యూజన్‌లో పడేస్తోంది. అదే సమయంలో మాస్ జాతర జూలై 18న రిలీజ్ కావాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే కేవలం ఒక వారం గ్యాప్‌తో ఈ రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌పై ఒకదానికొకటి పోటీగా మారే అవకాశముంది.
ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాలు అసలు సంక్రాంతికి రిలీజ్ కావాల్సినవే. కానీ రవితేజకి గతేడాది జరిగిన యాక్సిడెంట్ కారణంగా మాస్ జాతర షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా వాయిదా పడింది. భాను భోగవరపు అనే రచయిత ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మాస్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ కలగలిపిన సినిమాగా తెరకెక్కుతున్నట్లు టాక్.
అదే సమయంలో విశ్వంభర సంక్రాంతికి వచ్చేయాల్సింది. గేమ్ చేంజర్ అనే పెద్ద ప్రాజెక్ట్ తో క్లాష్ కాకుండా ఉండేందుకు వాయిదా వేశారనే వార్తలు వచ్చాయి. కానీ, టీజర్‌పై వచ్చిన మిక్స్‌డ్ రెస్పాన్స్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పై మరింత కసరత్తు చేస్తూ, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేసి బిగ్ స్క్రీన్‌పై గ్రాండ్ విజువల్స్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ మూవీపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఒక వారం గ్యాప్‌తో ఈ రెండు సినిమాలు వస్తే ప్రేక్షకుల్లో దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయంలో స్ప్లిట్ జరగడం ద్వారా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. చిరు సినిమాకు వయసు రేంజ్‌కు సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు. అలాగే రవి తేజ సినిమాలకు మాస్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. పైగా ఈ సినిమాలో కచ్చితంగా కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. దీంతో యువత, బీ సి సెంటర్స్ ప్రేక్షకులు దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవి తేజ మంచి స్నేహితులే. వాళ్ళు గతంలో వాల్తేరు వీరయ్యలో కలిసి నటించారు. ఇప్పుడు వీరిద్దరి సినిమాలు ఒకదానికొకటి పోటీగా వస్తే ఎలా ఉండబోతుందనేది ఫ్యాన్స్‌కి ఆసక్తికర అంశం. అయితే ఈ క్లాష్ నిజంగానే జరుగుతుందా లేక ఒక సినిమా వాయిదా పడుతుందా అన్నది మాత్రం అధికారిక ప్రకటనలతోనే స్పష్టమవుతుంది.