విశ్వంభర పనులు ఎంతవరకు వచ్చాయంటే..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ సంక్రాంతికి వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
By: Tupaki Desk | 4 Dec 2024 12:30 PM GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ సంక్రాంతికి వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ గేమ్ ఛేంజర్ రాకతో సైడ్ అవ్వక తప్పలేదు. అయినప్పటికీ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్, డ్రామా, సోషల్ ఫాంటసీ జోనర్ కలిపి రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ రిలీజ్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీకి సంబంధించి తాజా అప్డేట్ బయటకు వచ్చింది.
చిరంజీవికి సంబంధించిన మెయిన్ సీన్స్ షూటింగ్ దాదాపుగా పూర్తయిందట. కొంతమంది కీలక నటులతో కూడా ప్రధాన సన్నివేశాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఫినిష్ అయిన సీన్స్ అన్ని కూడా అద్భుతంగా వచ్చాయని, సినిమా భారీ విజయం సాధించేలా ఉన్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిరు నటన ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించనుందని టాక్.
ఇప్పుడు మూవీ టీమ్ సాంక్రాంతి సెలవుల తర్వాత ఒక ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరణను ప్లాన్ చేస్తోంది. ఈ పాట కుటుంబ కథా నేపథ్యంలో సాగే ఎమోషనల్ ట్రాక్ అని, అది ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుందని సమాచారం. ఈ సాంగ్‌లో చిరంజీవి తన మేనరిజమ్స్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేయబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు, ఈ పాట చిత్రీకరణకు ముందు సినిమా క్లైమాక్స్ వర్క్స్ మీద మేకర్స్ ఫోకస్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సినిమా విజువల్ గ్రాండియర్ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్న యూనిట్ ఇప్పటికే సీజీ వర్క్స్ మొదలుపెట్టింది. టాప్ లెవెల్ గ్రాఫిక్స్ కంపెనీలతో పని చేస్తున్న ఈ టీమ్, విజువల్స్‌ను ప్రేక్షకులకు అద్భుత అనుభూతి కలిగేలా రూపొందిస్తోందట. ప్రత్యేకంగా సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కాబట్టి, గ్రాఫిక్స్ మరింత కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ సినిమా విడుదలకు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ కాస్త ముందే ప్రమోషన్లు భారీ స్థాయిలో మొదలయ్యే అవకాశాలున్నాయి.
సంక్రాంతి తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి క్లారిటీ రానుంది. ఇక సమ్మర్ స్పెషల్‌గా మే 9న సినిమా రిలీజ్ చేస్తారని మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు, చిరంజీవి కొత్త స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి టెక్నికల్ టీమ్ అందరూ టాప్ లెవెల్‌లో ఉన్నారు.
ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లో మరో కీలకంగా నిలుస్తుందని, చిరు వశిష్ట కాంబినేషన్ మేజిక్ చేయబోతుందని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఇక ఇప్పుడు చిత్రీకరణ పూర్తి కావడం, గ్రాఫిక్స్ ఫినిష్ అవ్వడంతో, విశ్వంభర రిలీజ్ డేట్ దగ్గర పడుతుందని అర్ధమవుతుంది. అభిమానులకు ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా సమ్మర్ ట్రీట్ ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. మరి విశ్వంభర బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలి అంటే, మరికొన్ని రోజులు వేచి చూడాలి.