Begin typing your search above and press return to search.

విశ్వంభర బడ్జెట్ పెంచేస్తున్నారా..?

కానీ సినిమా అవుట్ పుట్ బాగా వస్తుండటం వల్ల ఇంకాస్త బడ్జెట్ పెంచి సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.

By:  Tupaki Desk   |   14 Jun 2024 6:11 AM GMT
విశ్వంభర బడ్జెట్ పెంచేస్తున్నారా..?
X

మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగా సినిమాను తెరకెక్కించాలని బడ్జెట్ కూడా పెంచేస్తున్నారని టాక్. యువి క్రియేషన్స్ వారు విశ్వంభర సినిమాను 150 నుంచి 200 కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తి చేయాలని అనుకున్నారట. కానీ సినిమా అవుట్ పుట్ బాగా వస్తుండటం వల్ల ఇంకాస్త బడ్జెట్ పెంచి సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.

విశ్వంభర సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ పడుతుంది. సినిమా అంతా కూడా విజువల్ ట్రీట్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఇంకాస్త ఎక్కువ ఖర్చు చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారట. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా రిస్క్ లేదన్నట్టే. అదికూడా ఒక మంచి కాన్సెప్ట్ మూవీకి బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గకూడదు.

బింబిసార తో తన సత్తా చాటిన వశిష్ట విశ్వంభర సినిమాతో మరోసారి తన ప్రతిభ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాలో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే అంశాలు చాలానే ప్లాన్ చేస్తున్నారట. చిరు కూడా రీ ఎంట్రీ తర్వాత రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న కామెంట్ వినిపించింది. అందుకే విశ్వంభర సినిమాతో వింటేజ్ చిరుని పరిచయం చేసేలా వశిష్ట సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

యువి క్రియేషన్స్ బడ్జెట్ విషయంలో దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. 2025 జనవరి 10న రిలీజ్ లాక్ చేసుకున్న ఈ సినిమాను అనుకున్న డేట్ కి తీసుకొచ్చేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నారు. సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా, సురభి లాంటి కథానాయికలు భాగం అవుతున్నారు. విశ్వంభర సినిమా తో చిరు మాస్ స్టామినా మరోసారి చూపించాలని ఫిక్స్ అయ్యారు. మెగా ఫ్యాన్స్ కూడా విశ్వంభర సినిమా మీద భారీ అంచనాలతో ఉన్నారు. చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తరహాలోనే విశ్వంభర సినిమా ఉంటుందని ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.