Begin typing your search above and press return to search.

మెగా యాక్షన్ సీక్వెన్స్ విశ్వంభర లేటెస్ట్ క్రేజీ అప్డేట్

ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఒలంపిక్ గేమ్స్ చూడడానికి వెళ్లిన చిరు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 July 2024 7:43 AM GMT
మెగా యాక్షన్ సీక్వెన్స్  విశ్వంభర లేటెస్ట్ క్రేజీ అప్డేట్
X

ఆరుపదుల వయసులో కూడా కుర్ర కారుతో ధీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఆ తర్వాత తిరిగి వనసహిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్వరలో చిరు విశ్వంభర అనే సోషో ఫాంటసీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఒలంపిక్ గేమ్స్ చూడడానికి వెళ్లిన చిరు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు.

సోషల్ మీడియాలో రెగ్యులర్గా చిరంజీవి తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోటోలు వైరల్ బాగా వైరల్ అవుతున్నాయి. పారిస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే చిరు విశ్వంభర షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక కీలకమైన యాక్షన్స్ సీక్వెన్స్ షూట్ చేయడానికి డైరెక్టర్ వశిష్ట అన్ని సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ యాక్షన్ సీక్వెన్స్ పూర్తయిన తర్వాత షెడ్యూల్ ప్రకారం మరొక సాంగ్ కూడా చిత్రీకరిస్తారు. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఎన్నో కథనాలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి కూడా ఒకటి.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఇప్పటికీ ఎంతోమంది ఫేవరెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ జలక్ తిరిగి కనిపించబోతోందని టాక్. ఆ మూవీలో చిరు ఏ రేంజ్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీలో కూడా అంతకుమించి తనలోని కామెడీ యాంగిల్ ని చూపించబోతున్నారట. అలాగే ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు కూడా చిరంజీవికి తగినట్టుగా భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీ రూపంలో చిరు ఖాతాలో ఓ సూపర్ డూపర్ సక్సెస్ నమోదయింది. అందుకే ఈసారి సంక్రాంతికి కూడా రాబోయే చిరంజీవి మూవీ అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. ఠాగూర్ చిత్రం తర్వాత తిరిగి ఈ మూవీలో త్రిష చిరంజీవి సరసన నటించడం.. పోనియన్ సెల్వన్ మూవీ తర్వాత త్రిషకు సౌత్ మార్కెట్లో పెరిగిన డిమాండ్.. ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతాయని టాక్.