Begin typing your search above and press return to search.

విశ్వంభర.. ఇంతమందిలో మెగాస్టార్ మెరవాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర

By:  Tupaki Desk   |   24 May 2024 2:30 PM GMT
విశ్వంభర.. ఇంతమందిలో మెగాస్టార్ మెరవాల్సిందే..
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విశ్వంభర మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయిపొయింది. మూవీ సెకండ్ షెడ్యూల్ కూడా అన్నపూర్ణ ఏడు ఎకరాల్లో మొదలైనట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరగబోతోందంట.

కీలక సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మిగిలిన క్యాస్టింగ్ కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. జగదేక వీరుడు అతిలోకసుందరి తరహాలో ఈ మూవీ కథాంశం ఉంటుందంట. పంచభూతాల కనెక్షన్ ఈ చిత్రంలో చాలా కీలకంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.

ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వశిష్ట మల్లిడి విశ్వంభర చేయబోతున్నారు. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ లో సైరా తర్వాత మరో సారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే సినిమాలో మెగాస్టార్ ఏకంగా 6 మంది బ్యూటీలు కనిపించబోతున్నారు. వీరిలో సిస్టర్స్ గా కొందరు కనిపిస్తే మరికొందరు ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ త్రిష కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. త్రిష కూడా షూటింగ్ లో పాల్గొంది. ఇప్పుడు నలుగురు అందాల భామలు ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ఎంపిక చేసారు. వారిలో ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న యంగ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి. నా సామిరంగా సినిమాలో వెంకటేష్ కి జోడీగా నటించిన ఆషికా రంగనాథ్ ఉన్నారు. అలాగే ఒకప్పటి హీరోయిన్స్ అయినా సురభి, ఇషాచావ్లా కూడా నటిస్తున్నారంట.

వీరు నాలుగురిలో ఇద్దరు స్వర్గంలోకంలో అప్సరసలుగా కనిపిస్తారనే ప్రచారం మినిపిస్తోంది. త్రిష చిరంజీవికి జోడీగా ఉండబోతోందని సమాచారం. ఇక ఇంతమంది అందాల భామలు మధ్యలో మెగాస్టార్ కచ్చితంగా మెరావాల్సిందే. ఆయన స్టైల్ గ్రెస్ గురించి ఎలాగూ చెప్పక్కర్లేదు. కానీ ఈతరం గ్లామర్ బ్యూటీలను ఆయన ఏ రేంజ్ లో డామినేట్ చేస్తారనే సినిమా వచ్చే వరకు చెప్పలేము.

ఇక 2025 సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బట్టి రిలీజ్ డేట్ పై మరోసారి కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి నుంచి రాబోయే సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ విశ్వంభరపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.