Begin typing your search above and press return to search.

విశ్వంభ‌ర ప‌తాక స‌న్నివేశాలు ఆ లెవ‌ల్లో

2025 సంక్రాంతి కానుక‌గా ఈ సోషియో ఫాంటసీ చిత్రం థియేటర్లలోకి రానుంది.

By:  Tupaki Desk   |   4 Aug 2024 11:59 AM GMT
విశ్వంభ‌ర ప‌తాక స‌న్నివేశాలు ఆ లెవ‌ల్లో
X

మెగాస్టార్‌ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ ఫాంట‌సీ చిత్రం విశ్వంభ‌ర‌. బింబిసార ఫేం వశిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. విశ్వంభర చిత్రీకరణ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరుగుతోంది.

2025 సంక్రాంతి కానుక‌గా ఈ సోషియో ఫాంటసీ చిత్రం థియేటర్లలోకి రానుంది.

ఇప్ప‌టికే మెజారిటీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో భారీ ఎత్తున జరుగుతోంది. ఈ ముగింపు కోసం భారీ యాక్ష‌న్ సన్నివేశాలు విజువ‌ల్ ఫీస్ట్ ని త‌ల‌పిస్తాయ‌ని చెబుతున్నారు. దీనికోసం భారీ సెట్లు నిర్మించార‌ని కూడా తెలుస్తోంది. వశిష్ట వినూత్నమైన ఫాంటసీ అంశాలను సమర్థవంతంగా తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిసింది.

భారతదేశపు అగ్రశ్రేణి యాక్షన్ కొరియోగ్రాఫర్ అన‌ల్ అర‌సు యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. అతడి అసాధారణమైన యాక్షన్ కొరియోగ్రఫీ క్లైమాక్స్ ని అత్యుత్త‌మంగా మారుస్తోంద‌ని తెలుస్తోంది.

మెగాస్టార్ ని మ‌రో కొత్త కోణంలో ఆవిష్క‌రించే చిత్ర‌మిది. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, అంజి త‌ర్వాత చిరు ఫాంట‌సీ సినిమాలో నటిస్తున్నారు గ‌నుక అభిమానుల్లోను బోలెడంత ఉత్కంఠ నెల‌కొంది. ఆషికా రంగనాథ్ - త్రిష కృష్ణన్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కునాల్ కపూర్ శక్తివంతమైన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్ర‌ఫీని అందిస్తుండ‌గా, ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు.