Begin typing your search above and press return to search.

విశ్వంభర కోసం స్పెషల్ కేర్..!

ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటే ప్రతి సినిమాకు మ్యూజిక్ ది బెస్ట్ ఉండేలా చూస్తారు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 3:30 AM GMT
విశ్వంభర కోసం స్పెషల్ కేర్..!
X

ఒక సినిమాకు కథ కథనంతో పాటు సంగీతం కూడా ఎంత ముఖ్యమన్నది తెలిసిందే. కొన్ని సినిమాలు కేవలం మ్యూజిక్ వల్లే ఆడేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో సంగీతానికి కూడా అంతే గొప్ప ప్రాధాన్యత ఇస్తుంటారు. కేవలం సాంగ్స్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. డైరెక్టర్ చెప్పే కథను మ్యూజిక్ తో ఇంకాస్త ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటే ప్రతి సినిమాకు మ్యూజిక్ ది బెస్ట్ ఉండేలా చూస్తారు.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న విశ్వంభర సినిమా విషయంలో సంగీతానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాకు అకాడమీ విన్నర్ ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వశిష్ట మొదటి సినిమా బింబిసారకు కూడా కీరవాణి మ్యూజిక్ అందించారు. విశ్వంభర సినిమాకు మాత్రం కీరవాణి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది.

కీరవాణి ఈ సినిమాకు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. విశ్వంభర సినిమా టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాకు మ్యూజిక్ ఎంత ప్రాధాన్య అవుతుందో శాంపిల్ చూపించారు. తెర మీద అద్భుతమైన విజువల్స్ కి అంతే గొప్ప సంగీతం ఉంటేనే కళ్లకు, చెవులకు ఇంపుగా ఉంటుంది. విశ్వంభర సినిమాలో ఎక్కువగా సీజీ వర్క్ జరుగుతుంది కాబట్టి అందుకు తగిన సంగీతం అందిస్తున్నారట కీరవాణి.

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే స్టెప్పులు అదిరిపోవాల్సిందే. కీరవాణి చిరు కోసం మంచి డ్యాన్స్ మూమెంట్స్ ఉండే బీట్స్ కూడా ఇస్తున్నారట. అటు డైరెక్టర్ కి కాన్సెప్ట్ పరంగా ఇటు హీరోకి తన ఫ్యాన్స్ కోరుకునే డ్యాన్సుల పరంగా రెండిటిలో విశ్వంభర కోసం కీరవాణి డబుల్ ఫోకస్ తో పనిచేస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో సంగీతం కూడా ఒకటిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా రాజమౌళి సినిమాలకే కీరవాణి ఎక్కువ ఇంపాక్ట్ ఫుల్ మ్యూజిక్ ఇస్తారన్న టాక్ ఉంది. అఫ్కోర్స్ అది రాజమౌళి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు. ఐతే వశిష్ట కూడా రాజమౌళి పంథాలోనే కీరవాణి నుంచి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ తీసుకుంటున్నారట. మరి విశ్వంభర కోసం కీరవాణి ఎలాంటి మ్యూజిక్ అందిస్తారన్నది చూడాలి.